Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సూర్య బర్త్‌డే స్పెషల్ - 'కంగువా' నుంచి టీజర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (12:41 IST)
జాతీయ అవార్డు గ్రహీత, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "కంగువా" టీజర్‌‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ తార దిశా పఠానీ హీరోయిన్. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న కంగువా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
కంగువా టీజర్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. మరో నాలుగు భాషల్లో త్వరలోనే టీజర్‌ను తీసుకొస్తామని చిత్ర బృందం తెలిపారు. రెండు నిమిషాల పాటు సాగిన ఈ టీజర్‌లో విజువల్ గ్రాండియర్, హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, మెస్మరైజ్ చేసే సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. 
 
ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు మూవీ టీమ్ శ్రమిస్తోంది. టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ద్వారా వచ్చే ఏడాది సమ్మర్‌లో కంగువా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి 
ఎడిటర్ - నిశాద్ యూసుఫ్, 
యాక్షన్ - సుప్రీమ్ సుందర్, 
డైలాగ్స్ - మదన్ కార్కే, డైలాగ్స్ - ఆది నారాయణ, పాటలు - వివేక్, మదన్ కార్కే, కాస్ట్యూమ్ డిజైనర్ - అను వర్థన్, దష్ట పిల్లై, 
కాస్ట్యూమ్స్ - రాజన్, కొరియోగ్రఫీ - శోభి, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఏ జే రాజా, 
కో ప్రొడ్యూసర్ - నేహా జ్ఞానవేల్ రాజా, పీఆర్వో - జీఎస్కే మీడియా, ప్రొడ్యూసర్స్ - కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, 
దర్శకత్వం - శివ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments