Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను అందుకే టార్గెట్ చేశారు... కంగనా రనౌత్ (video)

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:15 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరోమారు మాటల తూటాలు ఎక్కుపెట్టారు. బాలీవుడ్‌లోని సినీ మాఫియా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, డ్రగ్స్ వ్యవహారాన్ని తాను లేవనెత్తినట్టు గుర్తు చేశారు. అయితే, అదే డ్రగ్ మాఫియా కారణంగా ఆదిత్య ఠాక్రేకు ముప్పు వస్తుందనే తనను శివసేన టార్గెట్ చేసిందని ఆమె ఆరోపించారు. 
 
బీఎంసీ అధికారులు ఇటీవ‌లే నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా నిర్మించారని ఆరోపిస్తూ కంగ‌నా కార్యాల‌యాన్ని కూల్చేసిన విష‌యం తెలిసిందే. అయితే హైకోర్టును ఆశ్ర‌యించ‌గా కూల్చివేత‌పై.. కోర్టు స్టే విధించింది. మ‌రోవైపు ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ మ‌హారాష్ట్ర సీఎం కొష్యారిని క‌లిసి కంగనా విజ్ఞప్తి చేసింది. 
 
అంతకుందు... త‌న ఆఫీసు కూల్చివేత నేప‌థ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేపై విమ‌ర్శ‌లు గుప్పించింది. త‌న మాట‌ల‌తో శివసేన నేతలకు ముచ్చెమటలు పట్టించారు. ఇపుడు ఏకంగా సీఎం ఉద్ధ‌వ్ థాక్రే కుమారుడు ఆదిత్య‌థాక్రేను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ వ్య‌వ‌హారంతో సీఎం కుమారుడు ఆదిత్యాథాక్రేకు త‌లనొప్పులు వ‌స్తాయ‌ని, అందుకే త‌న‌ను టార్గెట్ చేశార‌ని కంగ‌నా ఆరోపించింది. ఎవ‌రు ఎవ‌రి ప‌ని ప‌డ‌తారో చూడాల‌ని కంగనా చుర‌క‌లంటించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments