Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓ మూగ గదిగా పేర్కొన్న కంగనా (video)

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (14:27 IST)
సోషల్ మీడియా ఖాతాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాను ఒక మూగ గదితో పోల్చారు. నిన్న ఏం రాశామో నేడు అది కనిపించదంటూ వ్యాఖ్యానించారు. తామేమి మాట్లాడామో అర్థంకాని వారికి సరైన వేదిక అంటూ సెటైర్లు వేశారు. అదేసమయంలో ట్విట్టర్ గొప్ప సామాజిక వేదిక అంటూ ప్రశంసలు  కురిపించారు. 
 
కాగా, గతంలో కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమె ట్విట్టర్ ఖాతాను గత 2021 మే నెల నుంచి నిషేధం విధించారు. ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ చర్య ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా తన వాణిని వినిపించాల్సి వస్తుంది. ఇదేమంత ప్రభావవంతమైనది కాదని అభిప్రాయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. 
 
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మూగబోయిన గది కింద లెక్కగట్టేశారు. ఇన్‌స్టా అంతా ఫోటోల మయమేనని గుర్తుచేశారు. అలాగే, ట్విట్టర్ కూడా ఉత్తమ సోషల్ మీడియా వేదిక కాదంటూ వ్యాఖ్యానించారు. మేధోపరంగా సైద్ధాంతిక పరంగా ప్రేరేపించేదంటూ వ్యాఖ్యానించారు. 
 
అయితే, ట్విట్టర్ ఇపుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి చేరింది. ట్విట్టర్ పాలసీ తర్వాత నిషేధానికి గురైన ఖాతాలను అనుమతిస్తామంటూ ఆయన ఇటీవల ప్రకటించడంతో కంగనా రనౌత్ ఖాతా తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments