Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్ రేప్‌లకు పరిష్కారం ఏంటి? కామాంధులను షూట్ చేయాలి : కంగనా

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (13:32 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న సామూహిక అత్యాచారాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ గ్యాంగ్ రేప్‌లకు పరిష్కారం ఏంటి అంటూ పాలకలను నిలదీసింది. పైగా, అత్యాచారాలకు పాల్పడే కామాంధులను బహిరంగంగా నిలబెట్టి కాల్చిపారెయ్యాలని డిమాండ్ చేసింది. 
 
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో అత్యాచారానికి గురైన 20 యేళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ యువతి పొలం పనులు చేసుకుంటుండగా నలుగురు అగ్రకుల యువకులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. 
 
ఈ ఘటనపై కందనా రనౌత్ స్పందించారు. రేపిస్టుల‌ని బ‌హిరంగంగా షూట్ చేయ‌మ‌ని కోరింది. ప్ర‌తి సంవ‌త్సరం ఇలా పెరుగుతూ పోతున్న సామూహిక అత్యాచారాల‌కు ప‌రిష్కారం ఏమిటి? ఈ ఘ‌ట‌న‌పై దేశం సిగ్గు ప‌డాలి. మ‌న కుమార్తెల‌ను కాపాడుకోలేక‌పోవ‌డం సిగ్గుచేటు అంటూ కంగ‌నా మండిప‌డింది. 
 
కాగా, కంగనా రనౌత్ గత కొద్ది రోజులుగా త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్ హీరో సుశాంత్ మ‌ర‌ణించిన త‌ర్వాత నుండి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని ఉద్ధేశిస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన ఈ అమ్మ‌డు ముంబైని పాక్ ఆక్రమి కాశ్మీర్‌గా అభివ‌ర్ణించింది. దీంతో కంగ‌నాపై శివ‌సేన క‌న్నెర‌జేసింది. ముంబైకి రానివ్వొద్దంటూ కూడా డిమాండ్ చేసింది. 
 
కానీ కేంద్రం కల్పించిన వై కేటగిరీ భద్రత నడుమ ముంబై వ‌చ్చిన కంగ‌నా వారం రోజుల పాటు ఉండి తిరిగి మ‌నాలీ వెళ్ళింది. దీన్ని జీర్ణించుకోలేని శివసేన నేతలు బీఎంసీ అధికారులతో ఆమె సినీ కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చివేయించారు. ప్రస్తుతం ఈ కూల్చివేత కేసు బాంబే హైకోర్టులో విచారణలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ను ఆడకుండా చేయాలని చూస్తున్నారు, నేను చూస్తాను: అంబటి రాంబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం