Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరితో కనెక్ట్ అయివుంటే నేనే టాప్ హీరోయిన్ ... వాపోతున్న బాలీవుడ్ నటి

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:59 IST)
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో తాను కనెక్ట్ అయివుంటే ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగుతూ ఉండేదానిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. ఆమె అలా మాట్లాడటానికి కారణం లేకపోలేదు. పూరి జగన్నాథ్ - ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'పోకిరి'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే తొలి ఛాన్స్ కంగనా రనౌత్‌కే వచ్చింది. కానీ, ఆమె ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకుంది. ఫలితంగా తెలుగులో అరకొర చిత్రాలు చేస్తూ, బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది. 
 
తాజాగా పోకిరి చిత్రం గురించి ఆమె స్పందిస్తూ, 'పోకిరి' సినిమాలో హీరోయిన్ ఆఫర్ తొలుత తనకే వచ్చిందని చెప్పింది. ఈ చిత్రం అడిషన్స్‌కు హాజరయ్యాను. ఆ సమయంలోనే గ్యాంగ్ స్టర్ మూవీకి కూడా ఆడిషన్స్ జరగడంతో వీటికి కూడా హాజరయ్యాను. తన ఆడిషన్స్ నచ్చి.. రెండు సినిమాలకు ఎంపికయ్యాను. అపుడు తాను 'గ్యాంగ్ స్టర్' వైపు మొగ్గు చూపడంతో పోకిరి చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయానని, ఈ కారణంగా పోకిరిలో ఛాన్స్ మిస్సయిందని చెప్పుకొచ్చింది. 
 
అపుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన ఆఫరు మేరకు పోకిరి చిత్రం చేసివున్నట్టయితే ఖచ్చితంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా అయివుండేదానినని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. అయితే, ఇదే పూరి జగన్నాథ్ - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఏక్ నిరంజన్ చిత్రంలో ఆమె నటించింది. కానీ, ఈ చిత్రం ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. 
 
కాగా, కంగనా రనౌత్ ఇపుడు బాలీవుడ్‌లో సీనియర్ నటి. పైగా, డేరింగ్, డాషింగ్ హీరోయిన్. కేవలం హీరోయిన్‌గానే కాకుండా చిత్ర దర్శకురాలిగా కూడా తనలోని ప్రతిభను నిరూపించుకుంది. అంతేకాదు, హీరోలకు సైతం సవాళ్లు విసురుతూ, ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ బీటౌన్‌ను షేక్ చేస్తుంటుంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments