Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె వల్లే పద్మావతి దీపికకు మద్దతివ్వలేదు : కంగనా రనౌత్

దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం "పద్మాపతి". సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (14:05 IST)
దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం "పద్మాపతి". సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో నటించినందుకు దీపిక తల తెగనరకుతామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన నేతలు హెచ్చరించారు. అలాగే, దీపిక తలకు రూ.10 లక్షల నజరానా కూడా ప్రకటించారు.
 
అయితే, దీపికకు, ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీని చంపుతామంటూ బెదిరింపులు రావ‌డంతో బాలీవుడ్ మొత్తం సినిమా యూనిట్‌కి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా దీపిక త‌ల‌ని న‌రికిన వారికి న‌జ‌రానా ఇస్తామని క‌ర్ణిసేన ప్ర‌క‌టించ‌డంతో దీనిపై ప‌లువురు సెలబ్రిటీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.
 
తాజాగా సీనియ‌ర్ న‌టి ష‌బానా అజ్మీ ప‌ద్మావ‌తికి మ‌ద్దతు ఇస్తున్న‌ట్టు బాలీవుడ్ న‌టీన‌టుల నుండి సంతకాల‌తో కూడిని పిటీష‌న్‌ని ప్ర‌ధానికి ఇవ్వాలని భావించింది. ఈ క్ర‌మంలో కంగనాని కూడా సంతకం పెట్ట‌మ‌ని కోరగా, ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇలా నడుచుకోవడానికి గల కారణాలను సైతం ఆమె వెల్లడించారు. 
 
షబానా అజ్మీ ఎప్పుడూ లెఫ్ట్‌, రైట్‌ వింగ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారని అందుకే ఇంకా పిటిషన్‌లో సంతకం చేయలేదన్నారు. ఈ విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు, ఐడియాలు ఉన్నాయని, దీపికకు నేను పూర్తి మద్దతు ఇస్తున్నాని అని కంగనా అంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం దీపికకు ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, డిసెంబర్ ఒకటో తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు వివాదాల కారణంగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments