Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధంలో శృంగారం కూడా ఓ భాగమే... చేస్తే తప్పేంటి : కంగనా రనౌత్

బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తాజా సినిమా ‘రంగూన్’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్‌లతో కలిసి కంగనా ఇందులో నటించింది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృంగార సన్నివే

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (09:37 IST)
బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తాజా సినిమా ‘రంగూన్’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్‌లతో కలిసి కంగనా ఇందులో నటించింది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృంగార సన్నివేశాలూ కనిపిస్తాయి. ఆ సన్నివేశాల్లో కంగనా రనౌత్ న్యూడ్‌గా నటించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె తనదైన శైలిలో స్పందించిది. ‘నిజానికి యుద్ధంలో శృంగారం కూడా ఓ భాగమే. శృంగారం ఓ కళే... అందువల్ల శృంగార సన్నివేశాల్లో నటించడం తప్పేలేదు’ అని  చెప్పుకొచ్చింది.
 
ఇదిలావుండగా, ఈ హాట్ లేడీ కంగనా రనౌత్ 'క్వీన్' తర్వాత బాలీవుడ్‌లో తన రేంజ్‌ను బాగా పెంచుకుంది. పైగా, తనకు తాను ఓ హీరోలా ఫీల్ అవుతోంది కూడా. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం 'రంగూన్'. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హాట్ హాట్‌గా కనిపించినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. 
 
అయితే, ఇలాంటి  సీన్లలో కంగనా నటించలేదనీ. డూప్‌తో తీశారంటూ వార్తలు లేకపోలేదు. అదేసమయంలో ఈ క్రేజీ హీరోయిన్ సెమీ న్యూడ్‌గా కనిపించిందని చెపుతున్నారు. ఏది ఏమైనా 'రంగూన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ... ఈ సినిమా సక్సెస్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ వంటి హీరోలు నటించినా...
 
సినిమాలో తన పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని అమ్మడు ధీమా ఉందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే సినిమాలో అమ్మడు సెమీ న్యూడ్‌గా కనిపించబోతోందన్న ప్రచారంలో నిజం లేదనే ప్రచారాన్ని... రీసెంట్‌గా రిలీజైన ఓ వీడియో సాంగ్ ప్రూవ్ చేసిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. 'యే ఇష్క్ హే' అనే పల్లవితో సాగిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది.
 
ఈ సాంగ్‌లో కంగనా సెమీ న్యూడ్‌గా కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నా... ఆ సీన్లలో ఆమె ఫేస్ ఎక్కడా పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. దీంతో ఈ సీన్లను కంగనాకు బదులు డూప్ పెట్టి షూట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి సీన్లలో నటించడం కంగనాకు కొత్తేమీ కాదు కదా. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్‌1 బీ వీసాలకు అనుకూలమే.. తేల్చేసిన డొనాల్డ్ ట్రంప్

RTC bus: కదులుతున్న బస్సులో ప్రయాణీకుడికి గుండెపోటు.. ఏమైందంటే?

Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు..

Three Monkey Flexes: చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు.. ఆ ఫ్లెక్సీలు ఎందుకు?

Liquor Lovers: మద్యం ప్రియులకు శుభవార్త.. నో స్టాక్ అనే బోర్డు పెట్టరట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం