Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కంచె' టీజర్‌కు అద్భుత స్పందన..

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2015 (08:59 IST)
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరూ చిత్రీకరించని రెండో ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో చూపిస్తున్నారు. జార్జియా దేశంలో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , ట్యాంకులు, యూనిఫాంమ్స్, ఇతర లొకేషన్లను వాడుకుని భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 
 
ఈ చిత్రం టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. సుమారు 45 సెకండ్ల రన్ టైం ఉన్న ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ చాలా చోట్ల మెగాస్టార్ చిరంజీవి గారి పోలికలో ఉండటం ఫాన్స్‌ని ఎంతో ఎక్సైట్ చేస్తోంది. 
 
బాలీవుడ్‌లో ఇటివలే గబ్బర్ చిత్రం‌తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments