Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ బాటలో కమల్ హాసన్.. ఇకపై సినిమాలు చేయబోవట్లేదు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలోనే ప్రస్తుతం సినీ లెజెండ్ కమల్ హాసన్ సినిమాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం మక్కల్ నీది మయమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కమల్ పార్టీ సం

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (17:03 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలోనే ప్రస్తుతం సినీ లెజెండ్ కమల్ హాసన్ సినిమాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం మక్కల్ నీది మయమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కమల్ పార్టీ సంస్థాగత ఏర్పాట్లలో బిజీగా వున్నాడు. దాంతో పాటు త‌న తాజా చిత్రాలు విశ్వ‌రూపం 2, శ‌భాష్ నాయుడు, భార‌తీయుడు సీక్వెల్‌కి సంబంధించిన పనులు చూసుకుంటున్నాడు. 
 
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే క‌మ‌ల్ హాస‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించాడు. ఈ క్ర‌మంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తాను సినిమాలో చేయబోవట్లేదని.. రిటైర్మెంట్ దగ్గరలో పడిందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. 
 
''మీరు సత్యజిత్ రేఎం, శ్యామ్ బెంగాల్ వంటి దర్శకులతో పనిచేయకపోవడం పై బాధపడుతున్నారా అని అభిమాని ప్రశ్నించగా, అందుకు కమల్ సమాధానం ఇస్తూ... వాళ్ళు తనకు బాగా తెలుసు. కానీ వాళ్ళు తనకు ఎప్పుడూ సినిమా ఆఫర్ ఇవ్వలేదు. పైగా సత్యజిత్ రే ఇప్పుడు లేరు.

తాను కూడా ఇకపై సినిమాలు చేయబోవడం లేదు'' అంటూ కమల్ హాసన్ తెలిపారు. ప్రస్తుతం త‌న తాజా చిత్రాలు విశ్వ‌రూపం 2, శ‌భాష్ నాయుడు, భార‌తీయుడు సీక్వెల్‌కి సంబంధించిన పనులను కమల్ చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments