Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (16:00 IST)
Kamal Haasan
సినీ లెజెండ్ కమల్ హాసన్ ప్రస్తుతం బెజవాడలో సందడి చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా షూటింగ్ కోసం కమల్ హాసన్ విజయవాడ వచ్చారు. పనిలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అతనికి ఆహ్వానం వచ్చినప్పుడు, అతను వెంటనే అంగీకరించాడు. 
 
విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. నగరంలోని గురునానక్ కాలనీలో నిర్వాహకులు కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగువారి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు.
 
సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు తనదైన ముద్ర వేసి సేవారంగంలో కూడా ముందున్నారని కొనియాడారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే కమల్‌హాసన్‌ విజయవాడకు వచ్చి కృష్ణుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, విజయవాడ ప్రజలు, కృష్ణ, మహేష్‌బాబు అభిమానుల తరుపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
 
 
 
కమల్ హాసన్ కొన్ని రోజులు విజయవాడలోనే ఉండనున్నారు. మొదట షూటింగ్ కోసం బెజవాడ వచ్చాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 
 
అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న టీమ్ విజయవాడలో 8000 వేల మందితో ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments