భారతీయుడు 2 నుంచి తాత వస్తాడే సాంగ్ ప్రోమో విడుదల

డీవీ
శుక్రవారం, 7 జూన్ 2024 (18:25 IST)
Tatha vachade song promo
కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం భారతీయుడు 2 . ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే చెన్నైలో జరిగింది. కాగా, ప్రీరిలీజ్ హైదరాబాద్ లో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా, ఈరోజు భారతీయుడు 2 నుంచి తాత వస్తాడే .. సాంగ్ ప్రోమో విడుదల చేసింది చిత్ర యూనిట్. 
 
తాత వస్తాడే.. వేళ్లు మడిచిపెడితే బొక్కలు షురే.. అనే పాటను విడుదల చేశారు. సిదార్త్, ప్రియా భవాని షా తోపాటు వందలాది జూనియర్స్ ఈ పాటలో పాల్గొన్నారు. ఈ పాటలో భారతీయుడు గెటప్ లో సిద్దార్థ్ కూడా కనిపిస్తాడు. వందలాది భారతీయుడు గెటప్ లుకూడా కనిపిస్తాయి. ఇది సినిమాలో కీలకమైన ఘట్టంగా పాటను బట్టి తెలుస్తోంది.
 
గాయకుడు  అరుణ్ కౌండిన్య పాడగా, బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్ నిర్వహించారు. అనిరుధ్ బాణీలు సమకూర్చారు.  సినిమాటోగ్రాఫర్ గా రవివర్మ వ్యవహరించారు. భారతీయుడు 2 జీరో టాలరెన్స్ అనే కాప్షన్ ఈ సినిమా జూలై 12న విడుదలకు సిద్ధం చేస్తోంది లైకా ప్రొడక్షన్, పెన్ స్టూడియో సంస్థలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments