Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి2 ట్రైలరే వందరోజులు ఆడుతుందంటున్నారంటే.. అసలు సినిమా ఎంత ఆడాలి మరి!

భారత సినీ ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లిన మూవీ బాహుబలి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి తీసిన 'బహుబలి ది బిగినింగ్' రెండో భాగం బాహుబలి2 మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీకి చెందిన

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (03:07 IST)
భారత సినీ ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లిన మూవీ బాహుబలి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి తీసిన 'బహుబలి ది బిగినింగ్' రెండో భాగం బాహుబలి2 మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌పై మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణరమణ (కల్యాణి మాలిక్) స్పందించారు. 
 
'ఇప్పుడే బాహుబలి 2 ట్రైలర్ చూశాను. నా గుండెలు అదిరిపోయినయ్! సినిమాతో సంబంధం లేకుండా ఇది కూడా విడిగా 100 రోజులు అడుతుంది. రికార్డులు బద్ధలు కొడుతుంది. మూవీ త్వరలో విడుదల కానుందని' ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు విశేషమైన స్పందన వస్తుంది.
 
బాహుబలి ఫస్ట్ పార్ట్ తరహాలోనే రెండో పార్ట్ కు సంబంధించిన పోస్టర్లను మూవీ యూనిట్ విడుదల చేస్తూ ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని పెంచుతోంది. అయితే వచ్చే నెలలో విడుదలకానున్న బాహుబలి2 ట్రైలర్ పై మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో బాహుబలి 2 ట్రైలర్ పై వర్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. 
 
సరిగ్గా ఇదే సమయంలో ఈ మూవీకి సౌండర్ సూపర్‌వైజర్‌గా చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణరమణ తాజా ట్వీట్ బాహుబలి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుందనడంతో సందేహం లేదు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments