త‌ను చేయ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ గురించి క‌ళ్యాణ్ రామ్ ఏమ‌న్నారంటే...?

టాలీవుడ్‌లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా ద‌గ్గ‌ర నుంచి మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైంది. ఆత‌ర్వాత వెంకీ - ప‌వ‌న్ క‌లిసి 'గోపాల గోపాల' సినిమా చేసారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి మ‌నం సినిమా చేసారు. ఇక నంద‌మూరి హీరోల మ‌ల్టీస్టా

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (12:47 IST)
టాలీవుడ్‌లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా ద‌గ్గ‌ర నుంచి మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైంది. ఆత‌ర్వాత వెంకీ - ప‌వ‌న్ క‌లిసి 'గోపాల గోపాల' సినిమా చేసారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి మ‌నం సినిమా చేసారు. ఇక నంద‌మూరి హీరోల మ‌ల్టీస్టార‌ర్ కూడా రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇందులో హ‌రికృష్ణ‌, ఎన్టీఆర్ కూడా న‌టిస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.
 
కానీ... ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం నా నువ్వే. ఈ చిత్రం ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన క‌ళ్యాణ్ రామ్ త‌ను చేయ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ గురించి కూడా చెప్పాడు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే.. ఇందులో న‌టించేందుకు ముగ్గురు న‌లుగురు హీరోల‌ను అనుకుంటున్నాం కానీ.. ఎవ‌రనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు అన్నారు. 
 
హీరోలు ఎవ‌ర‌నేది ఖ‌రారు అయిన త‌ర్వాత అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తామ‌ని తెలియ‌చేసారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments