Webdunia - Bharat's app for daily news and videos

Install App

'విజేత'గా ప్రేక్షకుల ముందుకురానున్న చిరు చిన్నల్లుడు

మెగాస్టార్ ఫ్యామినీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలు ఉండగా, తాజాగా ఆయన చిన్నల్లుడు కూడా వెండితెరపై హీరోగా కనిపించనున్నారు. ఈయన శ్రీజ భర్త. పేరు కళ్యాణ్ దేవ్. ఈయన నటిస్తున్న తొలి చిత్రం విజేత. గతంలో చిరంజ

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (06:13 IST)
మెగాస్టార్ ఫ్యామినీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలు ఉండగా, తాజాగా ఆయన చిన్నల్లుడు కూడా వెండితెరపై హీరోగా కనిపించనున్నారు. ఈయన శ్రీజ భర్త. పేరు కళ్యాణ్ దేవ్. ఈయన నటిస్తున్న తొలి చిత్రం "విజేత". గతంలో చిరంజీవి సినీ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రాల్లో 'విజేత' ఒకటి.
 
ఇపుడు ఇదే టైటిల్‌తో కళ్యాణ్ దేవ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మెగా అభిమానులు అంద‌రు క‌ళ్యాణ్ దేవ్ లుక్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయ్యారు. రాకేశ్ శ‌శి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న 'విజేత' చిత్రం తాజాగా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేసి జూలైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
 
ఇకపోతే, ఈ చిత్రంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కళ్యాణ వైభోగమే' ఫేం మాళవికా నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశంగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ 'వారాహి' ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. 
 
"బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. 'రంగస్థలం' చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments