Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్, కామెడీ, హారర్, థ్రిల్లర్ అంశాలతో కళింగ చిత్రం సిద్ధం : ధృవ వాయు

డీవీ
సోమవారం, 26 ఆగస్టు 2024 (16:19 IST)
Kalinga team
కిరోసిన్ సినిమా ఫేమ్ ధృవ వాయు  ఇప్పుడు కళింగ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు వస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీని సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నామంటూ ప్రకటిస్తూ ఓ ఈవెంట్‌ను నిర్వహించారు.
 
ధృవ వాయు మాట్లాడుతూ.. టీజర్, పోస్టర్ వీటితోనే కళింగ మీద హైప్ పెరిగింది. ఆల్రెడీ అన్ని చోట్లా బిజినెస్ అయింది. కంటెంట్ అందరికీ నచ్చడంతో అన్ని చోట్లా డీల్స్ అయిపోయాయి. ఇది కచ్చితంగా రెగ్యులర్ మూవీలా మాత్రం ఉండదు. అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఎమోషన్స్, లవ్, కామెడీ, హారర్, థ్రిల్లర్ ఇలా అన్నీ కావాలని పెట్టలేదు. స్క్రిప్ట్‌లో, కంటెంట్‌లో అవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చాయి. నేను ఎక్కువగా మాట్లాడే బదులు.. సినిమా మాట్లాడాలి. టీజర్, సాంగ్స్ చూడని వాళ్లంతా టీ-సిరీస్ యూట్యూబ్ చానెల్‌‌లో చూడండి. కంటెంట్, స్క్రీన్ ప్లే చాలా టైట్‌గా ఉంటుంది. ఇంత వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో అయితే రాలేదు. కచ్చితంగా ఈ సినిమాను థియేటర్లో చూసి ఆదరించండి. మా సినిమా సెప్టెంబర్ 13న రాబోతోంది’ అని అన్నారు.
 
 *కెమెరామెన్ అక్షయ్ మాట్లాడుతూ..* ‘కళింగ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. చాలా వరకు ఫారెస్ట్ ఏరియాల్లోనే షూట్ చేశాం. వర్షం, ఎండ అంటూ ఇలా చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా మాత్రం అద్భుతంగా వచ్చింది. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదని మాత్రం గ్యారెంటీ ఇస్తాను’ అని అన్నారు.
 
 *నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ..* ‘కళింగ గురించి అక్షయ్ సగం చెప్పాడు.. వంశీ మిగతా సగం చెబుతాడు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. సినిమాను చూసిన తరువాత ఓ మంచి ఫీలింగ్‌తో బయటకు వెళ్తారు. కళింగ అనేది ధృవ వాయు ఐడియా. మేం ఆయనకు సపోర్ట్ చేశామంతే’ అని అన్నారు.
 
 *హీరోయిన్ ప్రజ్ఞా నయన్ మాట్లాడుతూ..* ‘కళింగలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. లవ్, రొమాన్స్, హారర్, థ్రిల్లర్, కామెడీ ఇలా అన్నీ ఉంటాయి. ధృవ వాయు ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
 *నిర్మాత పృథ్వీయాదవ్ మాట్లాడుతూ..* ‘కళింగ సినిమా అద్భుతంగా వచ్చింది. చాలా వరకు అవుట్ డోర్‌లో, ఫారెస్ట్‌లో తీశాం. ఈ చిత్రానికి మొదటి హీరో కెమెరామెన్ అక్షయ్. ఆయన ఈ మూవీని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ధృవ వాయు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments