Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఇండియాలోనే రికార్డు క్రియేట్ చేసిన మ‌హేష్‌బాబు చిత్రంలోని క‌ళావ‌తి పాట‌

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (17:46 IST)
Mahesh Babu song poster
సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాట చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ మే 12 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.
 
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌ర‌పరిచిన ఫ‌స్ట్‌ సింగిల్ కళావతి నిన్న విడుద‌లై ట్రెమండ‌స్ రెస్పాన్స్ ద‌క్కించుకుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్, సింగ‌ర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డు వ్యూస్ సాధించి మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచింది. క‌ళావ‌తి పాట 24 గంట‌ల్లో 16 మిలియ‌న్ల వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన పాట‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక 24 గంట‌ల్లో ఈ పాటకు 806K లైక్స్  రావ‌డం విశేషం.
 
ఈ మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం.  మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
 
సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments