Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానాతో ఓవర్.. ఇక వెంకటేష్‌తో రొమాన్స్‌కు కాజల్ అగర్వాల్ రెడీ..

రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రొమాన్స్ చేసిన అందాల రాశి కాజల్ అగర్వాల్.. మరో దగ్గుబాటి వంశపు హీరో వెంకటేష్‌తో జోడీ కట్టేందుకు రెడీ అవుతోంది. వెంకటేశ్ కథానాయకుడిగా తేజ ఒక సినిమాను తెరకెక్కించడా

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (11:00 IST)
రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రొమాన్స్ చేసిన అందాల రాశి కాజల్ అగర్వాల్.. మరో దగ్గుబాటి వంశపు హీరో వెంకటేష్‌తో జోడీ కట్టేందుకు రెడీ అవుతోంది. వెంకటేశ్ కథానాయకుడిగా తేజ ఒక సినిమాను తెరకెక్కించడానికి సమాయత్తమవుతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో తొలుత అనుష్కను అనుకున్నారు. కానీ వెంకటేశ్ సరసన నాయికగా కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. కాజల్‌ను తీసుకునేందుకు సెంటిమెంట్ వుందని సినీ జనం అంటున్నారు. 
 
అదేంటంటే? చాలాకాలం క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కల్యాణం' సినిమాతోనే తెలుగు తెరకు కాజల్ అగర్వాల్ పరిచయమైంది. ఈ మధ్య తేజకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు లేకపోవడంతో.. కాజల్ అగర్వాల్‌ను తీసుకుంటేనైనా హిట్ కొట్టొచ్చునని తేజ భావిస్తున్నట్లు తెలిసింది. 
 
ఇప్పటికే తనకి ఫస్టు ఛాన్స్ ఇచ్చాడనే కృతజ్ఞతతోనే కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి'లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కావడం తేజతో పాటు ఆమెకి కూడా కలిసొచ్చింది. ఆ సెంటిమెంట్ కారణంగానే వెంకటేశ్ జోడీగా కాజల్‌నే తేజ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక వెంకీతో కాజల్ నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం డిసెంబర్ 13న (వెంకీ పుట్టినరోజు) ప్రారంభం కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments