Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో శోభనాన్ని ఎంజాయ్ చేశా.. కౌగిలింతతో దినచర్య ప్రారంభం : కాజల్

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (06:58 IST)
గత యేడాదిలో వివాహం చేసుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తన ప్రాణస్నేహితుడు, ముంబైకు చెందిన యువ వ్యాపారవేత్త గౌతం కిచ్లూను పెళ్లాడింది. ఆ తర్వాత ఆమె హానీమూన్‌ను మాల్దీవుల్లో జరుపుకుంది. దీనిపై కాజల్ స్పందిస్తూ, ఈ హనీమూన్‌ ఆసాంతం ఎంజాయ్ చేసినట్టు చెప్పుకొచ్చింది. 
 
అంతేకాకుండా, ప్రాణస్నేహితుడు భర్తగా తన జీవితంలోకి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. కామన్‌  ఫ్రెండ్స్‌ ద్వారా గౌతమ్‌ కిచ్లూతో ఏర్పడిన పరిచయం వైవాహిక బంధంతో సాఫల్యంకావడం తన జీవితంలో అపూర్వఘట్టమని ఆనందం వ్యక్తం చేసింది. 
 
ప్రస్తుతం వైవాహిక బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. వివాహానంతరం బాధ్యతలు పెరిగాయని, భర్తే జీవన సర్వస్వమైపోయారని చెప్పుకొచ్చింది. మాల్దీవుల్లో జరిగిన హనీమూన్‌ను ఆసాంతం ఎంజాయ్‌ చేశామంది. 
 
సినిమాల్ని ఫస్ట్‌లవ్‌గా ఫీలవుతానని.. చిత్రసీమకు ఎప్పటికీ దూరం కానని స్పష్టం చేసింది. కెమెరా ముందు ఉంటే ధ్యానం చేసిన ఆనందానుభూతికి లోనవుతానని కాజల్‌ పేర్కొంది.
 
ఇకపోతే, 'జీవితంలోని ప్రతి క్షణాన్ని సానుకూల దృక్పథంతో ఆనందంగా గడపటానికి ఇష్టపడతాను. రోజువారి దినచర్యను గౌతమ్‌ అందించే ప్రేమపూర్వక కౌగిలింతతో ఆరంభిస్తాను. ఆ తర్వాత మహామంత్ర జపించి, 30 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌ చేస్తాను' అని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments