Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అరవింద సమేత..'లో కాజల్ అంగాంగ ప్రదర్శన ఉంటుందా? త్రివిక్రమ్ ఏమంటున్నారు?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత.. వీర రాఘవ". ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు.

Webdunia
ఆదివారం, 27 మే 2018 (16:34 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత.. వీర రాఘవ". ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు. మొదటిసారి వీళ్ళిద్దరు కలసి చేస్తోన్న ఈ చిత్రం ఎలా ఉంటుంది? త్రివిక్రమ్, తారక్‌ని ఎలా చూపించనున్నాడు అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. ఇక హీరోయిన్ విషయానికొస్తే ఎన్టీఆర్‌తో పూజా హెగ్డే ఆడిపాడుతోంది. కాగా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందనేది తాజా సమాచారం. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సాంగ్‌లో చిందులేయనుందనే ప్రచారం సాగుతోంది.
 
గతంలో ఎన్టీఆర్ నటించిన 'జనతాగ్యారేజ్' సినిమాలో కాజల్ ఐటెం సాంగ్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో 'అరవింద సమేత..'లో ఎన్టీఆర్ స్టెప్పులకు కాజల్ అందాల చిందులు తోడైతే థియేటర్లన్నీ ఈలలతో గోల పెట్టేస్తాయని భావించిన త్రివిక్రమ్ ఈమెనే ఫైనల్ చేశారని టాక్. ఇదే నిజమైతే ఎన్టీఆర్‌తో రెండోసారి కాజల్ చేయబోతున్న ఈ పర్‌ఫార్మెన్స్ చూసేయొచ్చు మరి.
 
మరోవైపు, ఇటీవల పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. ఇందులో 'మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా' అనే పాట వినిపిస్తుంది. అటువంటి కీర్తన ఏదీ తన తాజా చిత్రం, ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'అరవింద సమేత'లో ఉండదని త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
 
'అజ్ఞాతవాసి'లో అటువంటి పాట పెడితే వర్కవుట్ కాలేదని గుర్తు చేస్తూ, అటువంటి పాట కొత్త సినిమా స్క్రిప్ట్‌లో లేదని చెప్పారు. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోయే వ్యక్తిని తాను కానని, విజయం సాధించినా, సినిమా పోయినా మామూలుగానే ఉంటానని చెప్పారు. అపజయం ఎదురైనప్పుడు మరింతగా పనిచేస్తే బయటపడవచ్చని, తానిప్పుడు అదే పని చేస్తున్నానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments