స్టార్ యాక్టర్ల మధ్య స్టైలిష్ స్టార్ నిలబడతాడా..! త్రివిక్రమ్ స్కెచ్ ఏంటి..?

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (20:27 IST)
త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా గురించి తెలుగు సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తుందట. మరి బన్నీ సినిమాలో స్టెప్పులేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు. 
 
సన్ ఆఫ్‌ సత్యమూర్తి తరువాత వీరిద్దరి మధ్య వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హైప్స్‌కు తగ్గట్లే సినిమాను కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడు త్రివిక్రమ్. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో స్క్రీన్‌పై మెరుపులు మెరిపించాలనుకుంటున్నాడు. అందుకోసం లోకల్ గర్ల్ కాజల్‌ను రంగంలోకి దింపుతూ కాజల్‌తో ఒక పాటను రెడీ చేస్తున్నారు.
 
జనతా గ్యారేజ్‌తో పక్కా లోకల్ అంటూ ప్రేక్షకులను ఫిదా చేశారు. ఈ స్టెప్పులకు ఫిదా అయ్యారట త్రివిక్రమ్. అందుకే తమ సినిమాలోను కాజల్‌తో ఒక స్పెషల్ సాంగ్ చేయించాలనుకుంటున్నారట. ఇంతకు ముందు ఆర్య-2లో అల్లు అర్జున్‌కు జోడీగా నటించింది కాజల్. త్రివిక్రమ్ బన్నీ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. 
 
పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా, నివేధా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరోయిన్ టబు కూడా మెరుపు కలిగిన క్యారెక్టర్ చేస్తోందట. హీరో సుశాంక్ కూడా ఒక కీరోల్ చేస్తున్నారట. మరి ఇంతమంది స్టార్లు సందడి చేస్తున్న ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందన్నదే ఆశక్తికరంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments