Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్ర లేచిన దగ్గర నుంచి ఐ లవ్ యూ చెప్పలేను.. సినీ వ్యక్తుల్ని పెళ్లిచేసుకోను: కాజల్

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (15:31 IST)
బ్రహ్మోత్సవం హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి నోరు విప్పింది. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని.. మూడేళ్ల నుంచి సింగిల్‌గానే ఉన్నానని చెప్పింది. మంచి వ్యక్తి దొరికేంతవరకు పెళ్లి గురించి ఆలోచించనని, అప్పటివరకు ఆ మాటెత్తదనని కాజల్ అగర్వాల్ తెలిపింది. ఇంకా తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోననని కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది. 
 
భార్యాభర్తలు వేర్వేరు వృత్తుల్లో ఉంటేనే వారి మధ్య అనుబంధం మరింత బలపడుతుందని, ఉదయం లేచిన దగ్గర నుంచి అతనికి ఐ లవ్ యూ చెబుతూ కూర్చోలేనని, అలాగని తాను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని అనుకోవాల్సిన అవసరమూ లేదని చెప్పింది. అయితే, మూడేళ్లుగా సింగిల్ అంటోన్న కాజల్ అంతకుముందు గురించి చెప్పలేదేంటి అంటూ సోషల్ మీడియాలో కుర్రకారు తెగ ఫీలైపోతున్నారు.
 
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీకల్యాణం సినిమా టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్ అగర్వాల్, ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ చిత్రంతో మంచి పేరు కొట్టేసింది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రంలో హీరోయిన్‌గా నటించి రికార్డు హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కాజల్ అగర్వాల్ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. 
 
ఈ సినిమాలు కాజల్‌కు ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టలేదు. అందుకే కాజల్ పెళ్ళి చేసుకుని సెటిలైపోతుందని అనుకుంటే.. మంచి వ్యక్తి ఇంకా దొరకలేదని.. అలాంటి వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments