Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ కోసం పైసా ఖర్చు చేయని కాజల్ .. అంతా ఫ్రీ...

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (11:20 IST)
ఇటీవల వివాహం చేసుకున్న టాలీవుడ్ అందాల నటి కాజల్ అగర్వాల్. అక్టోబరు 30వ తేదీన తన ప్రియుడు, యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది. ఆ తర్వాత హానీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ సముద్ర గర్భంలోని అందాల్లో ఆమె ఎంజాయ్ చేసింది. ఆ అందాల నడుమే ఆమె హనీమూన్‌ను జరుపుకుంది. 
 
అలాగే, తన భర్తతో కలిసి మాల్దీవుల్లోని అందాలను ఆస్వాదించి, సముద్ర‌పు అందాల నడుమ భర్తతో కలిసి గడిపి, ఫొటోలు తీసుకుని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే, ఈ హనీమూన్ కోసం ఆమె భారీగానే ఖర్చు చేసిందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. 
 
సాధారణంగా మాల్దీవుల్లోని ఓ హోటల్‌లో ఒక్క రాత్రి ఉండాలంటే రూ.38 లక్షలు ఖర్చు అవుతుంది. కాజల్ తన భర్తతో కలిసి 10 రోజులు ఉంది. అందుకోసం ఆమె దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ, ఇపుడు ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ హనీమూన్ కోసం ఆమె ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తేలింది. అంటే పైసా ఖర్చు లేకుండా హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసినట్లు తెలిసింది.
 
ఎందుకంటే పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేసుకోవడం కోసం సెలబ్రిటీలకు అక్కడ ఫ్రీగా పర్యటించేందుకు అక్కడి ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. సెలబ్రిటీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల కంటే అధికమంది ఫాలోవర్లు ఉంటే ఈ ఆఫర్ పొందొచ్చు. 
 
దీంతో కాజల్ ఉచితంగా హనీమూన్ ఎంజాయ్ చేసిందని తెలిసింది. ఇటువంటి సెలబ్రిటీలకు ఓ హోటల్ రూమ్‌తో పాటు భోజనం ఉచిత విమాన టికెట్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ ఆఫర్‌ కాజల్ వర్తించడంతో ఆమె ఉచితంగానే తన హానీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments