Webdunia - Bharat's app for daily news and videos

Install App

`ఖైదీ నంబ‌ర్ 150`లో కాజ‌ల్‌ ఎంట్రీ... మెగాస్టార్ చిరుతో న‌టించ‌డం ఎమేజింగ్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం- `ఖైదీ నంబ‌ర్ 150`. `బాస్ ఈజ్ బ్యాక్‌` అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ‌మ‌తి సురేఖ కొణిదెల స‌మర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (20:21 IST)
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం- `ఖైదీ నంబ‌ర్ 150`. `బాస్ ఈజ్ బ్యాక్‌` అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ‌మ‌తి సురేఖ కొణిదెల స‌మర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ  పతాకంపై మెగాపవర్‌స్టార్‌ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.  ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్‌ని ఫైనల్ చేసిన‌ సంగతి తెలిసిందే.
 
ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో చిరంజీవి - కాజ‌ల్ జంట‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆన్‌ లొకేష‌న్ నుంచి కాజ‌ల్ మాట్లాడుతూ -``సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించాక‌.. మెగాస్టార్ చిరంజీవి గారు న‌టించిన సినిమాలు చాలా చూశాను. అంత పెద్ద లెజెండ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం అమేజింగ్ అనిపిస్తోంది. ఇంత మంచి అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం షూటింగులో పాల్గొన‌డం ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. 
 
ఈరోజు నాకు మొద‌టిరోజు షూటింగ్‌. మునుముందు షెడ్యూల్స్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా`` అంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం శంషాబాద్ ప‌రిస‌రాల్లో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు నాయ‌కానాయిక‌ల మ‌ధ్య జ‌రిగే కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌త్న‌వేలు వంటి టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments