Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కబాలీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ.31 కోట్లు

Webdunia
శనివారం, 7 మే 2016 (10:10 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ''కబాలి'' టీజర్ ఇటీవలే విడుదలైంది. ఇప్పటికే ఈ టీజర్‌కి కోటి వ్యూస్ రావడంతో యూనిట్ సభ్యులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి టీజర్ విడుదలకాలేదంటూ దర్శకనిర్మాతలు అంటున్నారు. రజినీకాంత్ గతంలో విడుదలైన సినిమాల కంటే, ఈ హీరోని ఫ్యాన్స్ ఎలా చూడటానికి ఇష్టపడతారో అచ్చం అలాగే చూపించాడు రంజిత్. ఇన్నేళ్ల రజినీ కెరీర్‌లో రజినీకాంత్‌ని ఏ దర్శకుడు ఇంత కొత్తగా చూపించలేదు. 
 
ఈ చిత్రంలో డాన్ కబలేశ్వరన్ పాత్రను సూపర్ స్టార్ పోషిస్తున్నాడు. ''కబాలి'' బిజినెస్ ఇప్పుడు అనుకోని విధంగా దూసుకుపోతుంది. మొన్నటి వరకు సినిమాను తక్కువ స్థాయిలోనే అమ్మాలని రజినీ అనుకున్నాడు. 'లింగా', 'కొచ్చాడయాన్' ఫ్లాపులతో డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ రేట్లకు అమ్మాలనుకున్నారు. కానీ ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత బయ్యర్ల హక్కులు రెట్టింపయ్యాయి. 
 
తమిళనాడులో సినిమా బిజినెస్ 120 కోట్లు దాటేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక తెలుగులో ఈ చిత్ర హక్కుల్ని రూ.31 కోట్లకు కొన్నారట. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీనే 'కబాలి' హక్కుల్ని దక్కించుకుందట. ఓ డబ్బింగ్ సినిమాకు ఇది పెద్ద మొత్తంలో కొనడం ఇదే మొదటిసారి. 'రోబో'ను అప్పట్లో రూ.27 కోట్లకు కొన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో 'కబాలి' రైట్స్ అమ్ముడయ్యాయి. కబాలి జూన్ 3న విడుదల కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments