Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియాలో 'కబాలి' క్లెమాక్స్ మార్పు... ఇదీ రజినీ స్టామినా అంటూ విదేశీ మీడియా ప్రశంసలు!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి గత శుక్రవారం విడుదలైన 'కబాలి' చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. కలెక్షన్ల పరంగా కనకవర్షం కురిపిస్తోంది. అదేసమయంలో 'కబాలి' క్లైమాక్స్ మరో విధంగా ఉంటుందని ఆదివారం మలేషియ

Webdunia
సోమవారం, 25 జులై 2016 (14:39 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి గత శుక్రవారం విడుదలైన 'కబాలి' చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. కలెక్షన్ల పరంగా కనకవర్షం కురిపిస్తోంది. అదేసమయంలో 'కబాలి' క్లైమాక్స్ మరో విధంగా ఉంటుందని ఆదివారం మలేషియా ఫిల్మ్ సెన్సార్ బోర్డు తెలిపింది.
 
చిత్ర ముగింపులో హింస అన్నింటికీ పరిష్కారం కాదు అనే అర్థం వచ్చే సందేశాన్ని చివర్లో చేర్చినట్టు అధికారులు పేర్కొన్నారు. చట్టాలపై ప్రేక్షకులకు గౌరవం పెరగడానికే ఈ నిర్ణయం తీసుకొన్నామని ఎల్‌పీఎఫ్ ఛైర్మన్ అబ్దుల్ హలీం అబ్దుల్ హమీద్ తెలిపారు. చిత్రంలో చూపిన పాత్రలు నేర ప్రవృత్తితో కూడుకొన్నవని, చట్టాన్ని చేతులోకి తీసుకున్నట్టు చూపకుండా ఈ సందేశాన్ని పెట్టాలని చిత్ర నిర్మాతలకు సూచించామని తెలిపారు. 
 
వాస్తవానికి తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో క్లైమాక్స్‌లో రజినీకాంత్ హత్యకు గురైనట్టు తుపాకీ శబ్దాలను వినిపించి సినిమాను ముగించారు. అయితే మీడియా కథనాల ప్రకారం మలేషియాలో కబాలీ పోలీసులకు లొంగిపోయారు అనే సందేశాన్ని క్లైమాక్స్‌లో చూపించి చిత్రాన్ని ముగించినట్టు సమాచారం. ఇదిలావుండగా మలేషియాలో కబాలికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 
 
ఇంకోవైపు రజినీకాంత్ స్టామినా ఇదే అంటూ పొగడ్తల వర్షం విదేశీ మీడియా పొగడ్తల వర్షం కురిపిస్తోంది. "భారత చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రతియేటా 20కి పైగా భాషల్లో 1600కు పైగా కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. ఇండియాలో అతిపెద్ద స్టార్ రజనీకాంత్. అందుకు తాజా 'కబాలి' ఫ్యాన్ మేనియానే కొలమానం" అంటూ విదేశీ మీడియా రజినీ స్టామినాపై పొగడ్తల వర్షం కురిపించింది. 'ది వాషింగ్టన్ పోస్ట్' కబాలి చిత్రం గురించిన విశేషాలు చెబుతూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం గమనార్హం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments