Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కకు కళ్లుతిరిగే ఆఫర్... ఎందుకో తెలుసా?

సాధారణంగా సినీ నటీనటులకు, క్రికెటర్లకు కళ్లు తిరిగే ఆఫర్లు వరిస్తుంటాయి. మూగజీవులకు మాత్రం కడుపునిండా తిండి పెట్టడమే గగనమవుతున్న ఈ రోజుల్లో ఓ శునక రాజాకు కళ్లు తిరిగే ఆఫర్ వరించింది. దీనికి బలమైన కారణ

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (14:09 IST)
సాధారణంగా సినీ నటీనటులకు, క్రికెటర్లకు కళ్లు తిరిగే ఆఫర్లు వరిస్తుంటాయి. మూగజీవులకు మాత్రం కడుపునిండా తిండి పెట్టడమే గగనమవుతున్న ఈ రోజుల్లో ఓ శునక రాజాకు కళ్లు తిరిగే ఆఫర్ వరించింది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం "కాలా". ఇందులో ఓ కుక్క కీలక పాత్ర పోషించింది. దీంతో ఆ కుక్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రజనీకాంత్‌తో కలిసి నటించడం వల్ల ఈ కుక్కకి భారీస్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది.
 
ఈ అంశంపై ఆ కుక్క ట్రైనర్ స్పందిస్తూ.. 'చెన్నైలోని ఓ రోడ్డుపై ఓ కుక్క కనిపించింది. దీన్ని పట్టుకుని 'మణి' అనే పేరు పెట్టి ట్రైనింగ్ ఇచ్చాం. "కాలా" చిత్రం కోసం ఓ కుక్క కావాల్సి రావడంతో దర్శకుడు పా.రంజిత్ అనేక కుక్కలను పరిశీలించిన తర్వాత మణిని ఎంపిక చేసుకున్నాడు. 
 
నిజానికి రజనీ‌సార్‌కి ఈ కుక్క అంటే చాలా ఇష్టం. షూటింగ్ జరిగినన్నినాళ్లు ఆయన దానిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దాని కోసం ప్రత్యేకమైన బిస్కట్లు తెచ్చేవారు. ఇప్పుడు ఈ కుక్కను కొనడానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను దీనిని అమ్మదలచుకోలేదు. ఎందుకంటే నేను దీన్ని ఓ బిడ్డలా చూసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments