Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియాడిక్ కథతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన చిత్రమే క: హీరో కిరణ్ అబ్బవరం

డీవీ
సోమవారం, 14 అక్టోబరు 2024 (17:48 IST)
KA team
కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ఈ నెల 31న రిలీజ్ చేయడానికి కారణం మా వంశీ నందిపాటి. ఆయన మూవీ చూసి మంచి ప్రైస్ ఇచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నారు. మా అందరికీ "క" సినిమాపై సినిమాపై నమ్మకం ఉంది. ఈ రోజు ఆడియెన్స్ చాలా ఎంపికగా థియేటర్స్ కు వెళ్తున్నారు. కంటెంట్ నచ్చితేనే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. మా మూవీ టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదో కొత్త కంటెంట్ మూవీలో ఉండబోతోంది అనే వైబ్ క్రియేట్ అయ్యింది. కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి "క" సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. తమిళంలో సహా అన్ని భాషల్లో ఈ నెల 31నే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాం.
 
"క" సినిమా 70వ దశకం నేపథ్యంతో పీరియాడిక్ కథతో సాగుతుంది. కాబట్టి యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు, మీ ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలుంటాయి. "క" సినిమాలో జాతర సాంగ్ కు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. కథ ప్రకారం ఒక జాతర సాంగ్ ఉంటుంది. ఆ పాటను విజయ్ పొలాకీ మాస్టర్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. నాకు డ్యాన్స్ లు పెద్దగా రావు. మంచి ప్రాజెక్ట్ కు అన్నీ కుదురుతాయి అన్నట్లు డ్యాన్స్ లు కూడా ఈ పాటకు బాగా కుదిరాయి. నేను బాగా డ్యాన్స్ చేశాననే ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. 15 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. 
 
 "క" అనేది మా సినిమాకు యాప్ట్ టైటిల్. సినిమా చూశాక మీకే తెలుస్తుంది. కథ విన్నప్పుడు నేను ఏదైతే ఎగ్జైట్ అయ్యానో అలాంటి ఎగ్జైట్ మెంట్ ఫస్ట్ కాపీ చూసినప్పుడు కూడా కలిగింది. దుల్కర్ గారు మా మూవీని చూసి మలయాళ రిలీజ్ కు తీసుకున్నారు. ఆయన లక్కీ భాస్కర్ సినిమా కూడా ఈ నెల 31న వస్తుందని అనుకోలేదు. ముందు వారి సినిమా డేట్ ఇది కాదు. మా మూవీ కూడా డేట్ అనౌన్స్ చేయలేదు. "క" , లక్కీ భాస్కర్ ఒకే డేట్ కు రావడం అనుకోకుండా జరిగిన విషయం. పండగ సీజన్ కాబట్టి అన్ని సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ - కథను తెరకెక్కించే క్రమంలో మేమంతా ఏం ఫీల్ అయ్యామో అదే థియేటర్ లో మీరు అనుభూతి చెందుతారు. యూనిక్ పాయింట్ తో కథ చేశాం. అయితే ఆ కథను సరికొత్త స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించాం. అన్నారు.
 
డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ - 70 దశకం నేపథ్యంలో "క" సినిమా సాగుతుంది. అప్పట్లో మనకు సమాచారం ఇచ్చేది పోస్ట్ మ్యాన్. ఆ కాలంలో అభినవ్ వాసుదేవ్ అనే ఓ పోస్ట్ మ్యాన్ జీవితంలో జరిగే కథ ఇది. ఒక ప్రత్యేకమైన హాబీ ఉన్న ఆ పోస్ట్ మ్యాన్ ఆ హ్యాబిట్ కోసం ఏం చేశాడు. ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సివచ్చింది. అక్కడ అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనేది ఈ మూవీలో ఆసక్తికరంగా చూపించాం. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఉంది. "క" సినిమా ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్లేతో సాగుతుంది. మేము కథ చెప్పినప్పటి నుంచి కిరణ్ గారు ఈ క్యారెక్టర్ కోసం బాగా సన్నద్ధమయ్యారు. మీరు థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అభినయ వాసుదేవ్ మాత్రమే కనిపిస్తారు. కిరణ్ అబ్బవరం అని అనుకోరు. అంతగా క్యారెక్టర్ లోకి మారిపోయారు కిరణ్ గారు. అన్నారు.
 
హీరోయిన్ తన్వీ రామ్ మాట్లాడుతూ, కథ చెప్పినప్పుడు ముందు లైన్ గా చెప్పారు. ఆ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలిగింది.  కొన్ని సీన్స్ నటించినప్పటి కంటే ఎడిటింగ్ అయ్యాక బీజీఎంతో చూస్తే చాలా బాగా అనిపించాయి. మలయాళంతో చూస్తే తెలుగులో సాంగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్సులు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్తగా పంచాయితీల్లో DISPLAY BOARDS.. పారదర్శకతే ధ్యేయం: పవన్ కల్యాణ్ (video)

ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సిందేనా, ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేడర్లు ఎలా కేటాయిస్తారు?

బంగాళాఖాతంలో అల్పపీడనం - తిరుమల కొండపై కుంభవృష్టి

మహిళను భలే కాపాడిన ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్స్.. కానీ (video)

వెంట్రుకవాసిలో చావు తప్పడమంటే ఇదేనేమో... (Video Viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments