Webdunia - Bharat's app for daily news and videos

Install App

కే3 కోటికొక్కడు కన్నుల పండగలా వుంది : శ్రేయాస్‌ శ్రీనివాస్‌

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (16:27 IST)
Shreyas Srinivas, Sai Krishna
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా శివ కార్తిక్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై  శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది.
 
సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీగా విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత శ్రేయాస్‌ శ్రీనివాస్‌. ఈ సందర్భంగా నిర్మాతలు శ్రేయాస్‌ శ్రీనివాస్‌, సాయి కృష్ణ విలేఖరుల సమవేశం నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
‘కే3 కోటికొక్కడు’ సినిమా గురించి ?
కన్నడలో విజయవంతమైన కోటిగొబ్బ 3కి  తెలుగు డబ్బింగ్  ‘కే3..  కోటికొక్కడు''.  కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్దా దాస్, ఆషిక రంగనాద్ కీలక పాత్రలలు పోషించారు. నూతన దర్శకుడు శివ కార్తీక్ దర్సకత్వం వహించాడు. గత ఏడాది అక్టోబర్ 21న కన్నడలో విడుదలైన సినిమా పెద్ద విజయం సాధించింది. అదే సమయంలో ఇక్కడ విడుదల చేయాలనీ  భావిస్తే  మన దగ్గర వరుసగా పెద్ద సినిమాలు వున్నాయి. అందుకే ఇక్కడ విడుదల చేయలేకపోయాం. మంచి సినిమా మంచి డేట్ చూసుకొని వద్దామని ఎదురుచూశాం. సుదీప్ విక్రాంత్ రోణ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సంపాయించుకుంది. ఈ సినిమా తర్వాత మంచి మార్కెట్ ఓపెన్ అవుతుందనే ఆలోచనతో సెప్టెంబర్ 16న సినిమాని విడుదల చేస్తున్నాం. కన్నడలో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. దాదాపు 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.  సుదీప్ గారి కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ ఇది. ఇప్పుడు విక్రాంత్ రోనా బ్లాక్ బస్టర్ కావడం కూడా ఈ సినిమాకి కలిసొస్తుందని భావిస్తున్నాం.
 
తెలుగు చిత్ర పరిశ్రమలో నన్ను సపోర్ట్ చేస్తున్న అతిరథ మహారధులు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. నైజం, వైజాగ్-  దిల్ రాజు గారు, సీడెడ్ -ఎన్వీ ప్రసాద్ గారు, ఈస్ట్ వెస్ట్,  కృష్ణ- గీత ఆర్ట్స్, గుంటూరు- యువీ క్రియేషన్స్, నెల్లూరు -హరి పిక్చర్స్ విడుదల చేయడం ఆనందంగా వుంది. మంచి సినిమా ఇప్పుడు గోల్డెన్ హాండ్స్ చేతుల్లో వుంది. దాదాపు 300 వందల థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం.
 
సినిమా  జోనర్ ఏంటి ?
‘కే3 కోటికొక్కడు’ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. సుదీప్ గారు యాక్షన్, కామెడీ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ పండిస్తారు. షూటింగ్ 70 శాతం ఫారిన్ లో జరిగింది. ప్రేక్షకులకు కన్నుల పండగలా వుంటుంది. డబ్బింగ్ ఎక్కడా రాజీపడకుండా చేశాం. పటాకి పోరి అనే పాట కన్నడ సూపర్ హిట్ అయ్యింది. ఆ పాటని ఇక్కడ గీతా మాధురి, సింహతో పాడించాం. యంగ్ ట్యాలెంటడ్ రాజేష్ తో అనువాద స్క్రిప్ట్ చేశాం. అతనికి చాలా ప్రతిభ వుంది.
 
సుదీప్ ప్రమోషన్స్ కి వస్తున్నారా ?
సినిమా విడుదలై ఏడాది అయ్యింది. విక్రాంత్ రోణ కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో సుదీప్ గారు ప్రమోషన్స్ కి టైం ఇస్తారా ? అనే అనుమానం నాకూ వుండింది. అయితే ఆయనకి ఫోన్ చేసి అడగ్గానే '' 13 తేదిన ప్రిరిలీజ్ ఈవెంట్ పెట్టుకో. ఒక రోజు మొత్తం కేటాయిస్తా. ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేసుకో'' అని చెప్పారు. ఆయన అలా చెప్పడం చాలా ఆనందం ఇచ్చింది. చాలా పాజిటివ్ వైబ్స్ తో ఈ సినిమా విడుదలౌతుంది. ఈ సినిమాలో మాకు సహకరించిన సహా నిర్మాత సాయి గారు. ఈ సినిమాతో ఆయన పూర్తిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 17 న ఒక పెద్ద ప్రకటన వుంటుంది. పాన్ ఇండియా సినిమా తెలుగు రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.
'
మీ ప్రొడక్షన్ లో కొత్త సినిమాలు గురించి ?
'గోదారి కథలు 'అని ఒక సినిమా చేస్తున్నాం. మొత్తం ఐదు భిన్నమైన కథలు ఒక సినిమాగా వస్తున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద మొదటి ప్రయోగం ఇది. అక్టోబర్ నుండి షూటింగ్ వుంటుంది. మురళి ఈ చిత్రానికి దర్శకుడు. కళ్యాణ్ మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాయి గారు ప్రొడక్షన్ చూస్తారు. నా ద్రుష్టి మొత్తం ఈవెంట్ మ్యానేజ్ మెంట్ పైనే.
 
కోవిడ్ తర్వాత ప్రమోషన్స్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి ?
కోవిడ్ తర్వాత కాదు .. ఓవరాల్ గా సినిమా ప్రమోషన్స్ పరిస్థితులలో మార్పులు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ నుండి ఓటీటీ వరకూ దీనిపై నేను పరిశోధన చేశాను. ఒకప్పుడు మూడు గంటల సినిమా చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో ఒక సినిమాని మూడు రోజుల పాటు సగం సగం చూస్తున్నాం. తీరికలేని జీవన విధానం , సోషల్ మీడియా ఇలా చాలా కారణాలు వున్నాయి. ఇందులో భాగంగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. శ్రేయాస్ యాప్ ని మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాం. ఇందులో కొత్త కంటెంట్ ని చేస్తున్నాం. స్నాక్ ఫిలిమ్స్,(స్నాక్స్ తినేలోపల సినిమా పుర్తవ్వాలి)  మినీ మూవీస్ (15 నిమిషాలు) ఇంట్రాక్టివ్ ఫిలిమ్స్. (ఒక సినిమా రెండు స్క్రీన్ ప్లేలు) ఇలా డిఫరెంట్ కంటెంట్ చేస్తున్నాం. దిని కోసం కంటెంట్ టీం ని కూడా డిజైన్ చేశాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments