Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి... ఎప్పటికీ చిరంజీవినే... గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు: కే విశ్వనాథ్‌

సుమారు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రంతో తనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని చిరంజీవి ని

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (13:43 IST)
సుమారు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రంతో తనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని చిరంజీవి నిరూపించారని చెప్పుకొచ్చారు. 
 
చిరంజీవితో ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ వంటి సినిమాలు తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఇటీవల ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాను డైరెక్టర్‌ వీవీ వినాయక్‌తో కలిసి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘దాదాపు పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నా చిరంజీవి నటనలో గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ వయసులో కూడా ఇలా నటించగల నటులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారన్నారు. 
 
చిరంజీవి మరిన్ని సినిమాలు చేసి అభిమానులను అలరించాల తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అలాగే చిరంజీవిని తెరపై అందంగా, మాస్‌ కింగ్‌గా చూపించిన దర్శకుడు వినాయక్‌ను కూడా విశ్వనాథ్‌ ప్రశంసించారు. దిగ్గజ దర్శకుడి నుంచి కితాబులు అందుకోవడంతో వినాయక్‌ చాలా హ్యాపీగా ఉన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments