Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శాతకర్ణి' తెలుగువాడి సినిమా.. తెలుగోడిగా గర్విస్తున్నా : కె. రాఘవేంద్రరావు

బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసల జల్లు కురిపించారు. 'ఇది తెలుగువాడి చరిత్ర.. సాటి తెలుగువాడిగా నేనూ గర్వపడుతున్నాను' అని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (13:54 IST)
బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసల జల్లు కురిపించారు. 'ఇది తెలుగువాడి చరిత్ర.. సాటి తెలుగువాడిగా నేనూ గర్వపడుతున్నాను' అని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి.. తెలుగు వాడి చరిత్ర.. పాత్రలో అద్భుతమైన నటనతో జీవించిన నందమూరి బాలకృష్ణ తెలుగువాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్‌ ఒక తెలుగువాడు.. తెలుగువాడి చరిత్రని దశ దిశల చాటి చెప్తున్న చిత్ర బృందానికి నా అభినందనలు.. సాటి తెలుగువాడిగా నేనూ గర్వపడుతున్నా' అని పేర్కొన్నారు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం చూసిన ప్రముఖులు పలువురు క్రిష్‌ పైన, బాలకృష్ణపైన ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. 
 
అలాగే, మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నంబర్ 150పై కూడా రాఘవేంద్ర రావు ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. జగదేకవీరుడు మళ్లీ పుట్టాడంటూ ట్వీట్ చేశారు. 'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments