Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినిమా డైలాగ్‌ల‌పై జ‌స్టిస్ ఎన్‌.వి. ర‌మ‌ణ ఘాటు వ్యాఖ్య‌లు

Webdunia
శనివారం, 14 మే 2022 (17:30 IST)
Justice N.V. Ramana, K. Raghavendra Rao
ఒక‌ప్ప‌టి తెలుగు సినిమా స్వ‌ర్ణ యుగం అంటుంటారు. అచ్చ‌మైన తెలుగు, హాస్యం, భాష ప్రాధాన్య‌త వుండేవి. కానీ రానురాను కాలంమార‌డంతో ఓవ‌ర్‌సీస్ మార్కెట్ పెర‌గ‌డంతో సినిమా క‌థ‌లు, డైలాగ్స్ కూడా విదేశీయుల‌కు అనుగుణంగానే రాస్తున్నారు. చాలా తెలుగు సినిమాల్లో తెలుగు భాష‌, తెలుగు ద‌నం క‌నిపించ‌డంలేదంటూ సుప్రీంకోర్టుప్ర‌ధాన న్యాయ‌మూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కుముందు బాహుబ‌లి, ఆర్‌.ఆర్‌.ఆర్‌.ల‌తో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ‌స్థాయికి తీసుకెళ్ళిన ప‌రిశ్ర‌మ‌గా ఆయ‌న కీర్తించాడు. కానీ నేడు అంద‌రికీ చుర‌క‌వేశారు.
 
జ‌స్టిస్ ర‌మ‌ణ అభిప్రాయం ప్ర‌స్తుతం తెలుగు మీడియాలోనూ వుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోల‌కు విన్న‌వించినా వారంతా సినిమా అనేది వ్యాపారం ఓవ‌ర్‌సీస్ వ‌ల్ల అలా చేయాల్సివ‌స్తుంద‌ని చెప్పిన సంద‌ర్భాలూ వున్నాయి. 
 
ఇక‌, జ‌స్టిస్ ర‌మ‌ణ తెలుగు భాష‌పై మాట్లాడ‌డానికి కార‌ణం. ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు రాసిన `నేను సినిమాకు రాసుకున్న ప్రేమ‌లేఖ‌` అనే పుస్త‌క ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. తెలుగు సినిమా చూస్తూ స‌బ్‌టైటిల్స్ చ‌దివి డైలాగ్స్ అర్థం చేసుకునే ద‌య‌నీయ స్థితికి తెలుగు సినిమా వెళ్ళొద్దు అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో శ‌నివారంనాడు ఓ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న వీడియో ద్వారా మాట్లాడారు. మ‌రి ర‌మ‌ణ మాట‌ల‌కు సినీ ప‌రిశ్ర‌మ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments