Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్ పచ్చి అబద్ధాలకోరు.. నిర్మాతపై దాడి చేయలేదు : జూనియర్ ఆర్టిస్టులు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (14:44 IST)
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌పై జూనియర్ ఆర్టిస్టులు మండిపడ్డారు. నిర్మాతపై తాము దాడి చేసినట్టుగా ఆయన పచ్చి అబద్ధాలు చెపుతున్నారంటూ మండిపడ్డారు. విశాఖపట్టణంలో టాలీవుడ్ నిర్మాత అచ్చిబాబుపై దాడి చేశారనీ, ఈ విషయాన్ని నిర్మాతల మండలి  సీరియస్‌గా తీసుకున్నట్టు మంచు మనోజ్ మంగళవారం ప్రకటించారు. 
 
దీనిపై జూనియర్ ఆర్టిస్టులు ప్రసాద్, వెంకటేశ్ లు మంచు మనోజ్ ఆరోపిస్తున్నట్లు తాము అచ్చిబాబుపై ఎలాంటి దాడికి పాల్పడలేదని తెలిపారు. అచ్చిబాబు తమకు బకాయి ఉన్నారని, ఆ బకాయిలు చెల్లించమని మాత్రమే అడిగామని తెలిపారు. పలువురికి జీవనోపాధి కల్పిస్తున్న మంచు మనోజ్ వంటి వారు ఈ రకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేయడం తమను ఆవేదనకు గురి చేస్తోందని వారు చెప్పారు.
 
అంతకుముందు మంచు మనోజ్ స్పందిస్తూ... విశాఖలో టాలీవుడ్ నిర్మాత అచ్చిబాబుపై జరిగిన దాడిని పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చరిత్రలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కేంద్రంగానే చిత్ర నిర్మాణం జరుగుతున్నా... విశాఖలో షూటింగ్ అంటే హుషారుగా కదిలివస్తున్న తాము ఈ దాడి నేపథ్యంలో ఇక్కడికి రావాలంటేనే జడవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఫెడరేషన్ కార్డులు లేని జూనియర్ ఆర్టిస్టులే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments