Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నిజమేనా? హిందీలో జనతా గ్యారేజ్?!

Webdunia
గురువారం, 5 మే 2016 (11:45 IST)
బాహుబలి2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జయదేవ రాణా పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పౌరాణిక పాత్ర కావడంతోనే జక్కన్న రాజమౌళి వెంటనే జూనియర్ ఎన్టీఆర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆప్తుడైన రాజమౌళి తనను సంప్రదించడంతో యంగ్ టైగర్ కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే బాహుబలి 2లో యంగ్ టైగర్- రాజమౌళి కాంబినేషన్ మళ్లీ ఆవిష్కృతం కానుంది. 
 
అయితే బాహుబలి 2లో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్ని యూనిట్ వర్గాలు ఖండిస్తున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌ తప్ప వేరే ప్రాజెక్టు చేయట్లేదని సన్నిహితులు అంటున్నారు. కొరటాల శివతో చేస్తున్న జనతాగ్యారేజ్ తన కెరీర్ హిట్‌తో పాటు ఇండస్ట్రీ రికార్డుల పైనా కన్నేసిన జూనియర్.. ఆగస్ట్ 12న ఈ మూవీని రిలీజ్ చేసే వరకూ.. వేరే ప్రాజెక్టుల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని సినీ పండితులు అంటున్నారు.
 
ఇకపోతే, జనతా గ్యారేజ్ సినిమాని హిందీలోకి విడుదల చేయడానికి కొందరు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. వారిలో ముందుగా కరణ్ జోహార్.. 'జనతా గ్యారేజ్' బాలీవుడ్ హక్కులను దక్కించుకుటున్నట్టు తెలిసింది. కరణ్ జోహార్ గత ఏడాది 'బాహుబలి'ని హిందీలో రిలీజ్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరణ్ జోహార్ 'జనతా గ్యారేజ్' హక్కుల్ని తీసుకోనుడటంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మరి జనతాగ్యారేజ్ నార్త్‌లో ఏమేరకు హిట్ అవుతుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments