Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్.. హద్దులు దాటే అభిమానులు నాకొద్దు!

సినీ అభిమానులకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. హద్దులు దాటే అభిమానులు తనకొద్దంటూ పిలుపునిచ్చారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‍‌లో జరిగిన ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాను

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (13:42 IST)
సినీ అభిమానులకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. హద్దులు దాటే అభిమానులు తనకొద్దంటూ పిలుపునిచ్చారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‍‌లో జరిగిన ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దాడిలో పవన్ కల్యాణ్ అభిమాని తిరుపకితి చెందిన వినోద్ రాయల్ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఇది పెను దుమారం రేపింది. చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ ఏకంగా తిరుపతికి వెళ్లి.. అభిమాని తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. 
 
దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని ఘాటుగా స్పందించాడు. సినీ హీరోలపై అభిమానం తప్పు కాదని చెప్పిన జూనియర్... ఆ అభిమానం హద్దులు దాటకూడదని హితవు పలికాడు. అభిమానం ఎల్లప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని సూచించాడు. ముందు దేశం, తర్వాత కుటుంబం... ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం చూపాలని తేల్చి చెప్పాడు. సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్... భవిష్యత్తులో ఉండబోవని కుండబద్దలు కొట్టాడు. అందువల్ల అభిమానులు జాగ్రత్తగా మెలగాలని సూచించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments