Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ అభిమానుల‌కు నిరాశేనా..? ఆ పాటను ఎందుకు తొలగించారు?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అర‌వింద స‌మేత‌. దీనికి వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (12:32 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అర‌వింద స‌మేత‌. దీనికి వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాంగ్‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.... ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ చూసే అవకాశం లేద‌ట‌. కార‌ణం ఏంటంటే... రిలీజ్‌కు మరింత సమయం లేకపోవటంతో విదేశాల్లో చిత్రీకరించాలనుకున్న ఓ పాటను తొలిగించినట్టుగా తెలుస్తోంది. దీంతో సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉండనున్నాయి. వాటిలో ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్, మరొకటి ఇటీవల రిలీజ్‌ అయిన రొమాటింక్ సాంగ్‌ కావటంతో వాటిలో ఎన్టీఆర్‌ డ్యాన్సులు చూసే అవకాశం లేదు. 
 
ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తలతో తారక్‌ డ్యాన్స్‌లు చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశే అన్న టాక్‌ వినిపిస్తోంది. అక్టోబర్‌ 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. ఇది నిజ‌మో కాదో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments