Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానకిరాం కుమారులకు పంచెకట్టు ఉత్సవంలో ఎన్టీఆర్ దంపతులు హాజరు.. సందడే సందడి

దివంగత జానకిరాం కుమారులకు పంచెకట్టు మహోత్సవంలో ఎన్టీఆర్ దంపతులు సందడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేలంగిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. వీరితోపాటు తండ్రి హరికృష్ణ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (16:09 IST)
దివంగత జానకిరాం కుమారులకు పంచెకట్టు మహోత్సవంలో ఎన్టీఆర్ దంపతులు సందడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేలంగిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. వీరితోపాటు తండ్రి హరికృష్ణ దంపతులు, మరో అన్న కల్యాణ్‌రాం దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

హరికృష్ణ వియ్యంకుడు ప్రభాకర్‌రావు ఇంటి వద్ద దివంగత జానకిరామ్‌ కుమారులైన నందమూరి తారకరామారావు, సౌమిత్రి ప్రభాకర్‌ల పంచెకట్టు కార్యక్రయం పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. 
 
అంతకుముందు శుక్రవారం కరప మండలం వేళంగిలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు, హరికృష్ణలు కాకినాడలోని మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం ఎన్టీఆర్‌ అభిమానులతో నిండిపోయింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తున్నాడన్న సమాచారం ఉదయమే తెలియడం, దానికి తోడు కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టడం తదితర సమాచారం మేరకు పెద్ద ఎత్తున అభిమానులు సర్పవరం జంక్షన్ సమీపంలోని చుండ్రు శ్రీహరి నివాసానికి తరలివచ్చారు. భారీ ఎత్తు అభిమానులు తరలిరావడంతో కాకినాడ-పిఠాపురం రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎన్టీఆర్, హరికృష్ణ, శ్రీహరిలు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments