Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

డీవీ
గురువారం, 19 సెప్టెంబరు 2024 (16:05 IST)
Jany- srasti
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సహచర కొరియోగ్రాఫర్ స్రష్ట మధ్య ఎప్పటినుంచో అవినాభావ సంబంధం వుందనేది డాన్సర్ అసోసియేషన్ సభ్యులకు తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా కలిసి వుంటున్న వారు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అసలు ఈ ఇష్యూ వెనుక డాన్సర్ అసోసియేషన్ హస్తం వుందా? రాజకీయ కోణం దాగి వుందా? అనేది ఇండస్ట్రీ చర్చగా మారింది. దానికితోడు తాజాగా పుష్ప 2 సినిమాలో సింగిల్ కార్డ్ తో అల్లు అర్జున్, సుకుమార్ లు  ఓ సాంగ్ ను స్రష్ట చేత చేయించడం జరిగింది. ఇది తెలిసిన జానీ మాస్టర్ తను తెలీకుండా ఎలా చేశావ్? అంటూ ప్రశ్నించడం ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడం తోటి డాన్సర్లకు తెలిసిందే. 
 
ఇక మధ్యప్రదేశ్ కు చెందిన స్రష్ట, ఈటీవీలో ఢీ అనే  ప్రోగ్రామ్ ద్వారా పరిచయం అయింది. అప్పుడు జానీ మాస్టర్ ఆమెను చురుకుదనం, కలుపుకోలు తనం చూసి తనకు అసిస్టెంట్ గా ప్రమోట్ చేశాడు. అలా ఇద్దరూ పలు సినిమాలు చేశారు. పెద్ద హీరోల సినిమాలకు హీరోయిన్లకు స్రష్ట స్టెప్ లు నేర్పిస్తే, హీరోకు జానీ మాస్టర్ చేయించేవాడు. ఇద్దరు ఒక అవగాహనతో విదేశాల్లో కూడా షూటింగ్ లో పాల్గొని వచ్చారు. 2019లోనే జానీ మాస్టర్ తో సంబంధం వున్నదని చెప్పి ఈమె ఇప్పుడు బయటకు రావడం వెనుక బలమైన కారణం వుందని తెలుస్తోంది. 
 
తను నాన్ లోకల్. జాతీయ స్థాయిలో ఎదగాలనే కోరిక బలంగా వుంది. అందుకే హీరోయిన్ గా జానీ మాస్టర్ శర్వానంద్ సినిమాకు అవకాశం కల్పించాడు. ఆ టైంలో జానీ మాస్టర్ తో స్రష్ట ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చింది. అందులో జానీ మాస్టర్ లేనిదే నేను లేను. అన్నీ ఆయనే అంటూ గొప్పగా చెప్పిన వీడియో కూడా నేడు బయటకు వచ్చింది.  కానీ ప్రస్తుతం గొడవ వల్ల ఆమె ఆ అవకాశాన్ని కూడా కోల్పోయింది.
 
ఇక జానీ మాస్టర్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కు కొరియోగ్రాఫర్ గా వున్నాడు. అక్కడనుంచి జాతీయ స్థాయి సినిమాలు చేశాడు. అవార్డు కూడా ఇటీవలే దక్కింది. జానీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. డాన్సర్స్ అసోసియేషన్ లో అంచెలంచెలుగా ఎదగడం సహించలేని కొందరు ఆయన్ను తొక్కడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే స్రష్ట తో భార్యభర్తల గొడవలు వంటివి అసోసియేషన్ మీటింగ్ లోనే జరిగేవి. ఇలాంటి టైంలో తెలంగాణ కు చెందిన సురేష్ అనే డాన్స్ సభ్యుడు తనను జానీ మాస్టర్ తొక్కేయాలని చూశాడంటూ మీడియా ముందుకు వచ్చాడు. అసలు సెగ అక్కడ మొదలైంది. ఆ తర్వాత పెద్ద రాద్దాంతం కావడంతో చివరికి పెద్దల సహకారంలో సద్దుమణిగింది.
 
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి కావడం, జానీ మాస్టర్ కు జాతీయ స్థాయి అవార్డు రావడంతో కొందరు రాజకీయనాయకులు ఇభ్బంది కలిగించేలా చేయడానికి ప్రయత్నించినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ముంబై నటి కేసు, ఆ తర్వాత రాజ్ తరుణ్ వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మీడియాకు పెద్ద సరుకుగా మారింది. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ వల్ల అటు ప్రజా పాలనలో ముందడుగు పడడంలేదు. దానిని ప్రశ్నించే మీడియా లేదు. అన్నీ కెమెరాలు జానీ మాస్టర్ ఇష్యూపైనే వున్నాయి. 
 
ఈ సందర్భంగా గురువారంనాడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు జానీ మాస్టర్ భార్య అయేషా ఉరఫ్ సుమలత వచ్చింది. పొద్దున్నుంచీ అక్కడే పడిగాపులు కాచిన విలేకరులు ఆమె రాగానే మీకు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కారులో వెళుతుండగా నిలదీశారు. దానితో ఆమె అసలు మీకు ఎందుకు చెప్పాలి? మీ వల్లే మా బతుకులు నాశనం అయ్యాయనీ,  మీపైనా కూడా కేసు పెడతా? అంటూ ఘాటుగా స్పందించింది. దానితో విలేకరులు పెట్టండి. మాపై కేసు పెడితే ఎలా చేయాలో మాకు తెలుసు అంటూ గుసగుసలాడారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి మాట్లాడుతూ, రాజకీయంగా కొందరు చేసిన కుట్రలో ఆమె ఇరుక్కుపోయింది. పుష్ప 2లో పనిచేసినా భవిష్యత్ లో ఆమెకు అవకాశాలు రావడం కష్టమే. తిరిగి తన ఊరు వెళ్ళిపోతుంది. ఈలోగా కొందరికి ఈ ఇష్యూ వల్ల లాభం జరుగుతుంది. అది రాజకీయంగా కొందరికి ఉపయోగపడుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments