విష్ణు మంచు 19వ సినిమాకి జిన్నా టైటిల్ ఖరారు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (15:26 IST)
Vishnu Manchu, Jinnah
డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇది విష్ణు కి 19వ సినిమా. ఈ సినిమాలో 'గాలి నాగేశ్వరరావు' అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ రోజు (10.6.2022) సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విష్ణు మంచు సినిమా టైటిల్ ని కూడా వెరైటీ గా రివీల్ చేసారు. సునీల్, కోన వెంకట్, ఛోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్, ఇషాన్ సూర్య తో కలిసి సరదాగా చిట్ చాట్ చేస్తూ, ఫైనల్ గా 'జిన్నా' అనే టైటిల్ ని అనౌన్స్ చేసి వీడియోని విడుదల చేసారు. గాలి నాగేశ్వరరావు వంటి మాస్ క్యారెక్టర్ చేయడంతో పాటు 'జిన్నా' టైటిల్ ఈ సినిమాకి ఖరారు చేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. 
 
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments