Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంఛనంగా సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ గా జిన్ ప్రారంభం

డీవీ
శనివారం, 7 డిశెంబరు 2024 (19:17 IST)
Ramajogayya and zin team
అమిత్ రావ్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ "జిన్". ఈ చిత్రాన్ని సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తూ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి పోషిస్తున్నారు.

ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలతో జిన్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా...ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రాజ్ కందుకూరి, రామజోగయ్య శాస్త్రి స్క్రిప్ట్ ను అందచేశారు. 
 
ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - ఈ చిత్రానికి డైలాగ్స్ రాసిన వరదరాజ్ నాకు మంచి మిత్రుడు. పాన్ ఇండియా చిత్రాలు కన్నడలో రిలీజైతే ఆయనే రైటర్ గా వర్క్ చేస్తుంటారు. జిన్ సినిమాకు వరదరాజ్ గారు కో ప్రొడ్యూసర్ గా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాను కన్నడ తెలుగు బైలింగ్వల్ మూవీగా రూపొందిస్తున్నారు. రెండు భాషల్లో సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. జిన్ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
 
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - జిన్ సినిమా టైటిల్ బాగుంది. సస్పెన్ హారర్ థ్రిల్లర్ జానర్స్ కు పోటీ తక్కువగా ఉంటుంది. మంచి కంటెంట్ ఉంటే ఈ సినిమాలతో సులువుగా ప్రేక్షకులకు రీచ్ కావొచ్చు. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఈ మూవీలో ఉందని నమ్ముతున్నా. వరదరాజ్ గారు మంచి రైటర్. అమిత్ రావ్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి. డైరెక్టర్ చిన్మయ్ రామ్ తో పాటు టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.
 
డైలాగ్ రైటర్, కో ప్రొడ్యూసర్ వరదరాజ్ చిక్కబళ్లాపుర మాట్లాడుతూ,  సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం. కానీ జిన్ కథ విన్నప్పుడు ఇది కొత్తగా ఉంది అనిపించింది. ఈ సినిమాకు డైలాగ్స్ రాయడంతో పాటు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాను. అమిత్ రావ్ మంచి పర్ ఫార్మర్. డైరెక్టర్ చిన్మయ్ రామ్ టాలెంటెడ్ టెక్నీషియన్. త్వరలోనే  జిన్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. అన్నారు.
 
నిర్మాత నిఖిల్ ఎమ్ గౌడ మాట్లాడుతూ - జిన్ సినిమాను తెలుగు, కన్నడ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నాం. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం.
 
నటుడు అమ్రిత్ సాగర్ మాట్లాడుతూ, నేను గతంలో చిన్న రోల్స్ చేశాను. ఈ చిత్రంలో లీడ్ రోల్ తో మీ ముందుకు రాబోతున్నాను. ప్రేక్షకులందరికీ నచ్చేలా జిన్ సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అన్నారు.
 
డైరెక్టర్ చిన్మయ్ రామ్ మాట్లాడుతూ, ఇదొక మంచి కథ. స్క్రిప్ట్ పర్పెక్ట్ గా వచ్చేందుకు చాలా టైమ్ తీసుకున్నాం. ఇక్కడే హైదారాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, నాకు సపోర్ట్ చేస్తున్న టీమ్ అందరికీ థ్యాంక్స్. మీ సహకారం మా టీమ్ కు ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
హీరో అమిత్ రావ్ మాట్లాడుతూ, ఒక మంచి స్క్రిప్ట్ తో హీరోగా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

400 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఎలాన్ మస్క్!!

Rajinikanth: సినిమాల్లో సూప‌ర్‌స్టారే... రాజ‌కీయాల్లో మాత్రం పేలని తుపాకీ

Porcupine : పులికి చుక్కలు చూపించిన ముళ్ల పందులు.. బిడ్డల్ని ఎత్తుకెళ్తావా? (video)

ముందు అవంతి శ్రీనివాస్.. ఆ తర్వాత గ్రంధి శ్రీనివాస్.. వైకాపా షాక్

కూతురు పట్ల అలా ప్రవర్తిస్తావా? కువైట్ నుంచి వచ్చి బంధువును చంపేసిన తండ్రి.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

High blood pressure అధిక రక్తపోటు వున్నవారు ఏం తినకూడదు?

Fruits burn Belly fat, బెల్లీ ఫ్యాట్ కరిగించే పండ్లు, ఏంటవి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట తాగకల 5 పానీయాలు

Vitamin C Benefits: విటమిన్ సి వల్ల శరీరానికి 7 ఉపయోగాలు

winter health కండరాలు నొప్పులు, పట్టేయడం ఎందుకు?

తర్వాతి కథనం
Show comments