Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తెలుగు చిత్రం!!

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (16:50 IST)
అంతర్జాతీయ సినిమా ఉత్సవాలకు ఒక తెలుగు చిత్రం ఎంపికైంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ చిత్రాలు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జాబితాలో చోటుదక్కాలని, అక్కడ ప్రదర్శించాలని కలలుగంటుంటారు. కానీ, ఈ దఫా ఆ లక్కీ ఛాన్స్ నేచురల్ స్టార్ నానికి దక్కింది. ఆయన నటించిన జెర్సీ చిత్రం టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. 
 
క్రికెట్ పట్ల ఓ ఆటగాడికి ఉన్న అనురక్తిని ఎంతో హృద్యంగా, భావోద్వేగభరితంగా ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. గత యేడాది విడుదలై విమర్శలతో పాటు ప్రశంసలు అందుకుంది. 
 
తాజాగా అపురూపమైన ఘనత దక్కించుకుంది. 'జెర్సీ' చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు వెళుతోంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. 
 
ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి 15 వరకు జరగనుంది. 'జెర్సీ' చిత్రమే కాకుండా, 'సూపర్ 30', కార్తీ నటించిన 'ఖైదీ' (తమిళ్) కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేయనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments