సత్యదేవ్ సినిమాలో మరో హీరోయిన్ గా జెనిఫర్ పిచినెటో

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (18:39 IST)
Jennifer Pichineto
వెర్సటైల్ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు. ఒక హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ ని ఇటివలే ప్రకటించారు. ఈ రోజు మరో హీరోయిన్ పేరుని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రని జెనిఫర్ పిచినెటో పోషిస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో జెనిఫర్ అల్ట్రా మోడరన్ లుక్ లో ఆకట్టుకుంది.
 
వెటరన్ యాక్టర్ సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కథలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుండబోతుంది.
చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ నెలకొంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments