Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంజ్ కారు టైరు బ్లాస్ట్ కావడం వల్లే ప్రమాదం (video)

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (13:37 IST)
బెంజ్ కారు ముందుకారు టైరు పేలిపోవడం వల్లే హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరిగిందని ఆయన భార్య, సినీ నటి జీవితా రాజశేఖర్ వెల్లడించారు. అలాగే మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. స్వల్ప గాయాలతో బయటడిన తన భర్త... ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. 
 
కాగా, బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్‌సీ నుంచి వస్తుండగా రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. దీనిపై జీవితా రాజశేఖర్ ఓ వీడియోలో వివరణ ఇచ్చారు. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదు. ఆర్ఎఫ్‌సీ నుండి వ‌స్తున్న స‌మ‌యంలో కారు టైర్ బ్లాస్ట్ కావ‌డం వ‌ల‌న డివైడ‌ర్‌ని ఢీకొని కారు ప‌క్క‌కి వెళ్ళింది. ఎదురు వైపు నుంచి ఓ ఫ్యామిలీ సభ్యులు గ‌మనించి రాజ‌శేఖ‌ర్‌ని కారులో నుండి బ‌య‌ట‌కి తీశారని చెప్పారు. 
 
రాజ‌శేఖ‌ర్ ఫోన్ స్విచ్చాఫ్ కావ‌డం వ‌ల‌న త‌న‌ని సేఫ్ చేసిన వారి ద‌గ్గ‌ర ఫోన్ తీసుకొని ముందు పోలీసులకి స‌మాచారం అందించారు. ఆ త‌ర్వాత మాకు ఫోన్ చేసి ఎదురు ర‌మ్మ‌ని చెప్ప‌డంతో, మేము వెంట‌నే వెళ్ళాం. ఆయ‌న‌ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించాం. పోలీసుల‌తో పూర్తి విష‌యం వివ‌రించాం. వారితో ట‌చ్‌లోనే ఉన్నాం. కోలుకున్న త‌ర్వాత స్టేష‌న్‌కి వ‌చ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాల‌ని చెప్పారని తెలిపారు. 
 
నిజానికి ఇది చాలా ప్రమాదమని, అదృష్టవశాత్తు అభిమానుల ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనురాగాల వ‌ల‌న రాజ‌శేఖ‌ర్ గారు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. మీ అంద‌రికి ధ‌న్య‌వాదాలు అంటూ ఆ వీడియోలో జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments