Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలించిన రాయబారం... షూటింగ్‌కు హాజరుకానున్న జయసుధ

సహజనటి జయసుధ, ఆర్‌.నారాయణమూర్తి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య'. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో నిర్మాతలకు, జయసుధకు మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకు

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (20:11 IST)
సహజనటి జయసుధ, ఆర్‌.నారాయణమూర్తి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య'. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో నిర్మాతలకు, జయసుధకు మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. దీంతో జయసుధ షూటింగ్ స్పాట్ నుంచి వాకౌట్ చేసింది. ఈ కారణంగా ఒక రోజు షూటింగ్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కాస్ట్యూమ్స్‌ డిజైనర్లు జయసుధ కాస్ట్యూమ్స్‌ని సరైన సమయానికి అందించలేదు. దీంతో ఆమె చాలా సమయం ఎదురుచూశారు. ఈ కారణంగా ఆమె సెట్‌కు వెళ్లలేదు. ఈ విషయం తెలియక నిర్మాత జయసుధ వ్యక్తిగత సిబ్బందిపై కేకలేశారట. తర్వాత జయసుధ నిర్మాతకు జరిగిన విషయాన్ని వివరించారు. గత 30 ఏళ్లుగా జయసుధ తన దుస్తులను తానే డిజైన్‌ చేయించుకుంటున్నారు. షూటింగ్‌కు ఒక రోజు ముందే ఆమె దర్శకుడితో తన దుస్తుల గురించి చర్చిస్తారు. 
 
కాగా, ఆమె సరిగ్గా సపోర్ట్‌ ఇవ్వడంలేదని నిర్మాతలు ఛాంబర్‌ దృష్టికి తీసుకుచ్చినట్లు తెలిసింది. దీనిపై పెద్దలు జోక్యం చేసుకుని ఫలప్రదం చేసినట్టు సమాచారం. దీనిపై గురువారం జయసుధ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. 'ఇది పెద్ద విషయం ఏమీ కాదు, చిన్న అపార్థం అంతే. దర్శకుడు నాకు ఫోన్‌ చేసి చిత్రం షూటింగ్‌ యథాతథంగా జరుగుతున్నట్లు చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారమే ఈనె 3 నుంచి చిత్రం షూటింగ్‌ జరుగుతుంది' అని జయసుధ చెప్పినట్లు తెలిసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments