Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జయమ్ము నిశ్చయమ్మురా"... కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్

విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ వంటి ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన "జయమ్ము నిశ్చయమ్మురా" ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయ

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (19:01 IST)
విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ వంటి ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన "జయమ్ము నిశ్చయమ్మురా" ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోంది.
 
కరీంనగర్ కుర్రాడు ఉద్యోగం నిమిత్తం కాకినాడ వెళ్లి.. అక్కడ ఓ అమ్మాయి ప్రేమలో పడి.. ఆ ప్రేమను సాధించుకోవడం కోసం ఎన్ని అగచాట్లు పడ్డాడు? ఆ తర్వాత ఎవరితో ఎలా ఆడుకున్నాడు? అనే కథాశంతో ఆద్యంతం అత్యంత వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం సాధిస్తున్న దేశవాళీ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి "కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. 
 
డిసెంబర్ 2 (శుక్రవారం) ఉదయం ఆటలో కరీంనగర్ ప్రేక్షకుల్ని పలకరించి.. వరంగల్‌లో మధ్యాహ్నం, ఖమ్మంలో ఫస్ట్ షో, సెకండ్ షోల్లో "జయమ్ము నిశ్చయమ్మురా" టీమ్ సందడి చేయనుంది. డిసెంబర్ 3 (శనివారం) ఉదయం ఆటకి  విజయవాడ, మధ్యాహ్నం ఆటలో ఏలూరు, సాయంత్రం ఆటకు రాజమండ్రి, సెకండ్ షోకు కాకినాడలోని థియేటర్స్‌లో  చిత్ర బృందం సందడి చేయనుంది. 
 
ఈ విజయయాత్రలో హీరోహీరోయిన్స్ శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ, దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరిలతోపాటు ఈ చిత్రంలో నటించిన కృష్ణ భగవాన్, రవివర్మ, ప్రవీణ్, జోగి బ్రదర్స్, మీనా తదితర నటీనటులు పాలుపంచుకోనున్నారని చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు ఓ ప్రకటనలో తెలిపారు. 
 
"సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్‌తో.. "దేశవాళీ వినోదం" అనే సరికొత్త నినాదంతో నవంబర్ 25న విడుదలైన "జయమ్ము నిశ్చయమ్మురా" మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న విషయం తెలిసిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments