Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయహో రామానుజ సినిమా పాటలు తిలకించి మెచ్చుకున్న తెలంగాణ మంత్రులు

డీవీ
శనివారం, 22 జూన్ 2024 (16:02 IST)
Lion Dr. Sai Venkat Saiprasanna, veera shankar and ohters
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'జయహో రామానుజ'. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఇటీవల 'జయహో రామానుజ' సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లయన్ సాయి వెంకట్ కు అభినందనలు అందజేశారు. పాటలు బాగున్నాయంటూ వారు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 'జయహో రామానుజ' లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ - ఇటీవల మా 'జయహో రామానుజ' సినిమా పాటలను మన ప్రియతమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చూపించడం జరిగింది. వారు పాటలన్నీ తమకు బాగా నచ్చాయంటూ ప్రశంసిస్తూ ఆశీస్సులు అందజేశారు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు మా 'జయహో రామానుజ' సినిమా లిరికల్ సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా ఈవెంట్ కు వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలోని పాటల రూపకల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. సంగీత సాహిత్యాలు గొప్పగా ఉండాలని ఎంతో టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడకుండా సాంగ్స్ డిజైన్ చేశాం. మీ అందరికీ మా మూవీ సాంగ్స్ నచ్చాయని ఆశిస్తున్నాం. మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో జయహో రామానుజ చిత్రాన్ని రూపొందించాను. జయహో రామానుజ చిత్రంతో ఆయన గొప్పదనం తెలియజేయాలని సంకల్పించాను. జయహో రామానుజ సినిమా రూపకల్పనకు రెండేళ్ల సమయం పట్టింది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.
 
నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ - 'జయహో రామానుజ' సినిమా పాటలన్నీ మీకు నచ్చాయని నమ్ముతున్నాం. నాన్న సినిమా కోసం ఎంత శ్రమించారో ఈ పాటలు అందంగా తీసుకొచ్చేందుకు అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. 'జయహో రామానుజ' సినిమా నాన్నగారికి ఒక కల. ఈ సినిమా చిత్రీకరణలో పిల్లలుగా మమ్మల్ని కూడా భాగస్వాములను చేశారు. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా 'జయహో రామానుజ' సినిమా ఉంటుంది అన్నారు.
 
ఇంకా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్న కుమార్, ఎఫ్ డీసీ మాజీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. భక్తిని, చైతన్యాన్ని అందించేలా సంగీత సాహిత్యాలు కుదిరాయి. 'జయహో రామానుజ' సినిమా ఈతరం ప్రేక్షకులు చూడాల్సిన సినిమా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments