ప్రముఖ సినీ నటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని జయప్రద తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం మరణించినట్టు ఆమె వెల్లడించారు.
"నా అన్నయ్య రాజబాబు మరణవార్తను మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3.26 గంటలకు (గురువారం) హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలో పంచుకుంటాం" అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.