Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

సెల్వి
సోమవారం, 14 అక్టోబరు 2024 (20:15 IST)
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురైంది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో ఇటీవల జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా... విచారణ అనంతరం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. బాధితురాలిని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడిన కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
 
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. జానీ మాస్టర్ అరెస్టయ్యాక నార్సింగి పోలీసులు కోర్టు అనుమతితో అతనిని నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం