Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్ టీజర్ రిలీజ్.. ''బట్ సమ్ ఛేంజ్'' అంటూ ఎన్టీఆర్ డైలాగ్, యాక్షన్ అదుర్స్.. మీరూ ఓ లుక్కేయండి!

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. బుధవారం సాయంత్రం రిలీజైన ఈ టీజర్‌కు నెట్టినింట భారీ క్రేజ్ లభించింది. లైక్స్, వ్యూవ్స్ భారీగ

Webdunia
గురువారం, 7 జులై 2016 (10:32 IST)
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. బుధవారం సాయంత్రం రిలీజైన ఈ టీజర్‌కు నెట్టినింట భారీ క్రేజ్ లభించింది. లైక్స్, వ్యూవ్స్ భారీగా పెరిగిపోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
"నాన్నకు ప్రేమతో''లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ''మిర్చి'', ''శ్రీమంతుడు'' లాంటి బ్లాక్‌బస్టర్స్ తీసిన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో టాక్ సంపాదించుకుంది. 
 
పైగా.. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండడంతో సినిమాకు ప్లస్ అయ్యింది. ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అని టైటిల్‌కి క్యాప్షన్‌గా పెట్టారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్‌లో ఈ టీజర్ వీడియో వైరల్‌గా మారింది.
 
జనతా గ్యారేజ్ టీజర్ అంటూ హీరో ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. లేటెస్ట్ టీజర్ గమనిస్తే.. 'బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ సమ్ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఓ బలవంతుడు ఉంటాడు. జనతా గ్యారేజ్ ఇచట అన్నీ రిపేర్ చేయబడును' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్‌లోని డైలాగే ఇది. మొత్తం 34 సెకన్ల ఈ టీజర్‌లో యాక్షన్ అదిరిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై జూనియర్ ఎన్టీ ఆర్ అభిమానుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments