Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డుల రేస్ : జాబితాలో "జై భీమ్" చిత్రానికి చోటు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (13:23 IST)
భారతీయ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "జై భీమ్" చిత్రం ఆస్కార్ పురస్కారాల రేసులో చోటు దక్కించుకుంది. 
 
గతేడాది ఓటీటీల వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా సర్వత్రా ప్రశంసలు దక్కించుకుంది. ఐఎండీబీ రేటింగ్‌లోనూ శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు 94వ ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అత్యున్నత పురస్కారం కోసం మరో 275 చిత్రాలతో పోటీ పడబోతోంది. 
 
ఇటీవలే 75 రోజులను పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఇటీవల ది అకాడెమీకి చెందిన అధికారిక యూట్యూబ్ చానెల్‌లో 12 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇందులో చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు.. దర్శకుడు టీజే జ్ఞానవేల్ వ్యాఖ్యలను జోడించారు. ఇపుడు ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతున్న 275 చిత్రాల రేసులో ఈ చిత్రం చోటుదక్కించుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments