Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్ లేదు.. మహిళలకు భారత్‌లో భద్రత లేదు: అమలా పాల్

ఇద్దరమ్మాయిలతో ఫేమ్, వీఐపీ2 నటీమణి అమలా పాల్.. కెరీర్‌ కోసం భర్తను పక్కనబెట్టి.. సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న అమలాపాల్.. ఏడాది తిరగకుండానే ఆతనికి దూరమ

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (14:58 IST)
ఇద్దరమ్మాయిలతో ఫేమ్, వీఐపీ2 నటీమణి అమలా పాల్.. కెరీర్‌ కోసం భర్తను పక్కనబెట్టి.. సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న అమలాపాల్.. ఏడాది తిరగకుండానే ఆతనికి దూరమైంది. కెరీర్ పరంగా కొన్ని షరతులు విధించడంతోనే తన పెళ్ళి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చిందని గతంలో తెలిపిన అమలాపాల్.. ప్రస్తుతానికి మరో పెళ్ళి చేసుకోవడంలో ఎలాంటి ప్లాన్స్ లేవని చెప్పింది. 
 
వీఐపీ 2 రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్‌లో బిజీబిజీగా వున్న అమల.. కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టానని.. పెళ్ళి ఆలోచన తన మైండ్‌లో లేదని క్లారిటీ ఇచ్చేసింది. వీఐపీ2కి తర్వాత ధనుష్‌తో వడ చెన్నై చిత్రంలో నటించాల్సిందిగా ఆఫర్ వచ్చింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సినిమాలో తాను నటించలేకపోతున్నట్లు చెప్పింది. వీఐపీ2, తిరుట్టుపయలె 2 చిత్రాలు త్వరలో రిలీజ్ అవుతాయని.. వీటి ద్వారా తనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పుకొచ్చింది.
 
సుచీలీక్స్‌పై అమ్మడు మాట్లాడుతూ.. ధనుష్, అమలా కలిసిన వీడియో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాం. సుచీలీక్స్‌కు తన స్నేహితురాలైన గాయని సుచిత్రకు ఎలాంటి సంబంధం లేదనే విషయం తేలిపోయిందని చెప్పుకొచ్చింది. ఇంకా మనదేశంలో మహిళలకు భద్రత లేదని వాపోయింది. అయితే మహిళల భద్రత గురించి అమలా పాల్ ఇప్పుడెందుకు మాట్లాడిందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
ధనుష్, అమలాపాల్, కాజల్ నటించిన వీఐపీ 2 సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది. ఇదిలా ఉంటే అమలాపాల్‌కు మలయాళ సినిమాను తెలుగు-తమిళంలో రీమేక్ చేయనున్న 100 డిగ్రీ సెల్సియస్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. ఇందుకు అమలాపాల్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లేడిఓరియెంటెడ్ సినిమాగా ఇది తెరకెక్కనుంది. మరో హీరోయిన్‌గా హన్సిక కూడా ఇందులో నటించనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments